దేశంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఎంతో మంది పేదవారు కష్టాలు పడుతున్నారు.  ఇక సినీ కళాకారులు ఎన్ని బాధలు పడుతున్నారు. అన్ని సినీ పరిశ్రమలకు చెందిన సినీ పెద్దలు సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఏ పని లేక  ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో 10 మందికి, చెన్నై లో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి అకౌంట్లో వేశారు.

 

రాఘవ లారెన్స్ మాట్లాడుతూ, "డాన్స్ నే నమ్ముకుని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం నా బాధ్యత గా భావించి వారి అకౌంట్ల కు డైరెక్ట్ గా డబ్బు పంపించడం జరిగింది" అన్నారు.  తను పైకి వచ్చిన నృత్య రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కష్టకాలంలో ఆదుకుంటూ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు.  తనను ఎంతగానో నమ్ముకున్న దివ్యాంగ నృత్య కళాకారులకు అండగా నిలిచారు రాఘవ లారెన్స్.

 

ఈ కష్టకాలంలో వాళ్లను ఆర్థికంగా ఆదుకున్నారు. తన సినిమాల్లోని ఒక పాటలో కచ్చితంగా దివ్యాంగ డ్యాన్సర్లను చూపిస్తూ ఉంటారు. తన ఛారిటీ నుంచి వాళ్లకు సాయం అందిస్తూ ఉంటారు. ఇప్పుడు, ఈ కరోనా కష్టకాలంలో తనను నమ్ముకున్నవారు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఈ ఆర్థిక సాయం అందిస్తున్నారు.ఇదిలా ఉంటే, తన అభిమాన నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌తో లారెన్స్ నటించబోతున్నారు. రజినీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా వస్తోన్న ‘చంద్రముఖి 2’లో తాను నటిస్తున్నట్టు లారెన్స్ ఆ మధ్య ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: