టాలీవుడ్ లో ఇప్పుడు భిన్నమైన సినిమాలు చేయడం అనేది అంత సాధారణ విషయం కాదు అనే విషయం అందరికి తెలిసిందే. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే చిన్న చిన్న సినిమాల్లో కూడా కాస్త భిన్నంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మన తెలుగులో మార్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే రెగ్యులర్ కథలను అభిమానులు వద్దు అని అంటున్నారు కాబట్టి కథల్లో కొన్ని మార్పులు ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. అగ్ర నిర్మాతలు అయినా చిన్న నిర్మాతలు అయినా సరే దీన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు ప్రస్తుత౦. 

 

మన తెలుగు సినిమాల్లో ఇప్పుడు భిన్నమైన కథల కోసం హీరోలు కూడా ఎక్కువగా ఎదురు చూస్తూ వస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలు కూడా కథలో మార్పులు కోరుతూ రావడం గమనార్హం. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి ఇదే విషయం చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం తారక్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముందు కథ విన్న జూనియర్ ఎన్టీఆర్ భారీగా మార్పులు చెప్పాడని సమాచారం. తాను గ్లామర్ ఉన్న పాత్రలకు దూరంగా ఉంటా కొన్ని రోజులు అని దాన్ని దృష్టిలో పెట్టుకుని కథను రెడీ చెయ్యాలని కోరినట్టు సమాచారం. 

 

దీనితో ఇప్పుడు ఎక్కువగా  త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ లో మార్పులు చేస్తున్నాడు అని టాక్. టాలీవుడ్ జనాలకు కూడా ఇప్పుడు భిన్నమైన కథలు కావాలి కాబట్టి ఇప్పుడు కథల విషయం లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. టాలీవుడ్ జనాలకు ఇప్పుడు ఎక్కువగా కథల్లో మార్పులు ఉంటేనే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు అని అంటున్నారు. తెలుగు సినిమాల మీద ఇప్పుడు బాలీవుడ్ కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే కథల్లో మార్పులు ఎక్కువగా చెప్తున్నారు హీరోలు.

మరింత సమాచారం తెలుసుకోండి: