ఊహించ‌ని ఉత్పాతంలా విరుచుకుప‌డి  ప్ర‌పంచవ్యాప్తంగా పంజా విసురుతూ  మాన‌వాళి మొత్తాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హమ్మారి ధాటికి అగ్ర దేశాల‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లే త‌ల్ల‌క్రిందులై పోతున్నాయి. వైర‌స్ వ్యాప్తి నిరోధానికి దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్లు ప్ర‌క‌టించ‌డంతో రంగం ఈ రంగం ఆని లేకుండా అన్ని రంగాలు క‌రోనా దెబ్బ‌కు కోలుకోలేని విధంగా దెబ్బ తింటున్నాయి. ఈ బాట‌లోనే సినీ ప‌రిశ్ర‌మ కూడా గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని విధంగా తీవ్ర ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటుంది. దేశంలో దాదాపు నెల రోజుల‌కు పైగా సినిమా థియేట‌ర్ల‌న్నీ మూత ప‌డ్డాయి. ఇవి ఎప్ప‌టికీ తెరుచుకుంటాయో ఖ‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ఇక నిర్మాణంలో ఉన్న చిత్రాల షెడ్యూల్ల‌‌న్నీ హ‌ఠాత్తుగా ఆగిపోయాయి.  

 

నిర్మాణం పూర్తి చేసుకున్న చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న‌కు అవ‌కాశం లేదు. ఇవ‌న్నీ ప‌రిశ్ర‌మ‌ను అత‌లాకుతలం చేసేవే. ఈ ప‌రిణామాలు ప‌రిశ్ర‌మ‌లోని వివిధ విభాగాల మ‌ధ్య తీవ్ర విభేదాల‌కు, వివాదాల‌కు దారి తీస్తున్నాయి. ఇలాంటి వివాదాల‌ నేప‌థ్యంలోనే  త‌మిళ స్టార్ హీరో సూర్య సినిమాల‌పై ఆ రాష్ట్ర థియేట‌ర్ల య‌జ‌మానులు ఏకంగా నిషేధాస్త్రాన్ని సంధించ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనికి కార‌ణమేమిటంటే లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్ల‌లో చిత్రాల‌ను విడుద‌ల చేసే అవ‌కాశం లేనందున సూర్య స‌తీమ‌ణి జ్యోతిక న‌టించిన సినిమా "పోన్ మ‌గ‌ల్ వంద‌ల్‌"ను మే మొద‌టి వారంలో నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించ‌డ‌మే.

 

ఈ సినిమాను 2 డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై స్వ‌యంగా సూర్య నిర్మించాడు. దీంతో సినిమా త‌మ థియేట‌ర్ల‌లో కాకుండా అమెజాన్ ద్వారా డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌‌పై విడుద‌ల చేయ‌డ‌మేమిట‌ని ఎగ్టిబిట‌ర్లు విరుచుకుప‌డుతున్నారు. ఇక‌పై సూర్య తీసే చిత్రాల‌ను త‌మ‌ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసేది లేద‌ని కూడా వారు తేల్చి చెబుతున్నారు. ఈ వివాదంపై   త‌మిళ‌నాడు థియేట‌ర్ అండ్ మ‌ల్టీప్లెక్స్ య‌జ‌మానుల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌న్నీర్‌సెల్వ‌న్ మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్ర ద‌ర్శ‌క నిర్మాతల నిర్ణ‌యానికి తాము షాక్ తిన్నామ‌ని, మొద‌ట‌గా చిత్రాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసిన త‌రువాత మాత్ర‌మే మిగిలిన ప్లాట్‌ఫాంల‌పై విడుద‌ల చేసుకోవాల‌న్న‌ది త‌మ డిమాండ్ అని తెలిపాడు. 

 

అయితే నిర్మాత‌లు ఎగ్టిబిట‌ర్ల డిమాండ్‌కు ఒప్పుకుంటే ఎప్ప‌టికి ప‌రిస్థితి చ‌క్క‌బ‌డి థియేట‌ర్లు తెరుచుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితి. ఇది నిర్మాత‌లను ఆర్థిక ఇబ్బందుల పాలు చేసే అవ‌కాశాముంది. ఈ నేప‌థ్యంలో ఈ స‌మ‌స్య ఏ విధంగా ప‌రిష్కారం కానుంద‌నేది ఉత్కంఠ క‌లిగిస్తోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: