వింతలూ విడ్డూరాలు వెండి తెర మీదనే పండవు. నిజ జీవితంలోనూ అవి జరుగుతూంటాయి. అయితే అద్భుతాలకు కూడా టైం ఉంది. ఆ టైం వచ్చినపుడు అవి తప్పనిసరిగా జరిగిపోతాయి. ఒక అద్భుతం జరిగినపుడు తెలియదు. తెలిసిన తరువాత దాని గురించి అంతా చెప్పుకుంటారంటే. ఓ విధంగా కొన్ని విషయాలను పాజిటివ్ గా ఆలోచించాలి.

 


అలాటిదే కరోనా మహమ్మారి గురించి. కరోనా వైరస్ ఇపుడు అతి పెద్ద ముప్పుగా మారింది. ఇది రఫ్ఫాడించేస్తోంది. దేశాలకు దేశాలను దాటి వచ్చి మరీ సవాల్ చేస్తోంది. ఈ రోజు ప్రపంచమంతా తెలిసినది ఎవరైనా ఉంటే అది కరోనావే. ఇవన్నీ ఇలా ఉంటే కరోనా వల్ల టాలీవుడ్ కి తగిలిన దెబ్బ  ఒక్కలా లేదు. సినిమా బొమ్మ తిరగబడిపోయింది. మళ్ళీ బద్దలైన బాక్సులు ఎపుడు సౌండ్ చేస్తాయో ఎవరికీ తెలియదు.

 

తలపండిన టాలీవుడ్ ప్రముఖులు కరోనా బాధలు, లాక్ డౌన్ కష్టాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ గట్టెక్కాలంటే కనీసం ఆరు నెలలు సమయం పడుతుంది అంటున్నారు. అంటే అప్పటికి కానీ ఒక కొలిక్కి వస్తుందన్న అంచనా ఉంటుందన్న మాట. ఇక సాధారణ పరిస్థితులకు సినిమా రంగం రావాలంటే కనీసంగా నాలుగేళ్ళు పడుతుంది అంటున్నారు.

 

ఈ నేపధ్యంలో సినిమా హాళ్ళకు జనాలు వస్తారా అన్న డౌట్ ఉండనే ఉంది. దానికి కూడా సినీ పెద్దలు  తరుణోపాయం ఆలోచించారట. అదేంటి అంటే స్టార్ హీరోలంతా మూకుమ్మడిగా పడిపోయి ధియేటర్లను కుమ్మేయడమే. అంటే ఇప్పటికైతే ఏడాదికి ఒక సినిమా, ఇంకా చెప్పాలంటే రెండేళ్ళకు ఒక సినిమా చేస్తున్నారు. 

 

ఇకపైన అలా కాదుట. కనీసంగా నెలకు ఒక సినిమా రిలీజ్ అయ్యేలా స్టార్ హీరోలు షూటింగులు చేయలంట. అపుడే ధియేటర్లు క్రౌడ్ పుల్లర్స్ గా మారుతాయని, జనాలు కూడా మళ్ళీ సినిమా హళ్ళకు వెళ్లి చూడడానికి అలవాటు పడతారని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. అంటే మన హీరోలు బద్దకం విడిచేసి నెలకు ఒక సినిమా రిలీజ్ చేయాలన్న మాట.

 

అప్పట్లో ఎన్టీయార్, క్రిష్ణ ఎక్కువగా సినిమాలు చేసేవారు. మళ్ళీ ఆ ట్రెండ్ వస్తేనే తప్ప సినిమా పరిశ్రమ బతికి బట్టకట్టదు అంటున్నారు. సో హీరోలకు పారితోషికం సైజ్ భారీగా కట్. అదే టైంలో ఒళ్ళోంచి  సినిమాలే సినిమాలు చేయాలన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: