రవితేజా. మాస్ మహారాజ్. కొన్నేళ్ళ క్రితం అతని సినిమాలు అంటే యూత్ కి భలే క్రేజ్. సగటు యూత్ మెంటాలిటీని వెండితెర మీద చూపించి తెరని చింపేసే ఊపు ఇచ్చిన హీరో.అసిస్టెంట్  డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లో చిన్న క్యారక్టర్లు వేస్తూ టాప్ రేంజికి హీరోగా ఎదిగిన రవితేజ ఈనాటి తరానికి ఓ రోల్ మోడల్.

 

ఆయన ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా వచ్చి నిలదొక్కుకున్నాడు. తన సినిమాలతో యూత్ ని కేక పెట్టించిన రవితేజా ఈ మధ్య కొన్ని ఫ్లాప్స్  వరసగా ఎదుర్కొన్నాడు.  ఆయనకు మంచి హిట్ పడాలి. కష్టపడుతున్నా ఫలితం దక్కడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే రవికి ఇపుడు జంట కుదరడంలేదుట. అదే హీరోయిన్ల సమస్య ఆయనకూ వచ్చింది.

 

టాలీవుడ్లో బాలయ్య ఒక్కరికే ఈ సమస్య అన్నట్లు బయట ప్రొజెక్ట్ అవుతున్నా యాభై దాటేసిన హీరోలకు, రీచ్ అవుతున్న హీరోలకు హీరోయిన్లు అసలు దొరకడంలేదు. రవితేజా కూడా సర్దుకోవాల్సివస్తోంది. మూవీ అంటేనే గ్లామర్ ఉండాలి. మసాలా పండాలి. మరీ చీప్ గా కాస్టింగ్ ఉంటే అసలు  చూడరు.

 

కానీ హీరోలకు ఇపుడు అదే పెద్ద సమస్యగా మారింది. దాంతో రవితేజా తనతో ఒకపుడు వేసిన వారితోనే రిపీట్ చేయాల్సివస్తోందిట. ఆయన కొత్త చిత్రాల్లో హీరోయిన్ల పేర్లు  కొన్ని ప్రచారంలో  ఉన్నాయి. అవి చూస్తే రవి కి ప్రోబ్లం స్టార్ట్ అన్న మాట వినిపిస్తుంది. ఇదిలా ఉండగా రవితేజా పక్కన శ్రుతిహాసన్ అని ఒక సినిమాలో చెబుతున్నారు.

 

మరో సినిమాలో త్రిషను కూడా అనుకుంటున్నారుట. అంటే రవితేజా ఎపుడో పదమూడేళ్ళ క్రితం క్రిష్ణ మూవీలో చేసిన త్రిష అప్పట్లో టాప్ రేంజిలో ఉండేది. ఇపుడు త్రిష బాగా తగ్గింది.  అయినా సరే ఆమెను తీసుకుని మూవీని స్టార్ట్ చేయాలనుకుంటున్నారుట. మరి రవి తేజా పక్కన స్టార్ హీరోయిన్లు చేయారా, లేక వారు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. 

 

ఏది ఏమైనా ఓ వైపు హీరోయిన్ల కొరత ఉంది. ఇంకో వైపు చూసుకుంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని హీరోయిన్లు కూడా చూస్తున్నారు. దాంతో సీనియర్ హీరోలు, ఒక రేంజి హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టమైపోతోంది అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: