బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఏ రేంజ్‌లో సక్సెస్ అయింతో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  2006వ సంవత్సరంలో హిందీలో ఆరంభమైన ఈ రియాలిటీ షో ఫ్రాంచైజీ.. 2018కి కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ ఇలా అన్ని భాషల్లోనూ తనదైన సత్తా చూపిస్తోంది. ఈ రియాలిటీషోకు ఇంటిల్లి పాది ముఖ్యంగా యువత విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ఇక తెలుగులో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.  జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా మొదటి సీజన్ హిట్ కాగా.. రెండో సీజన్‌కు నాని హోస్టుగా వ్యవహరించాడు. 

 

ఇక ఇటీవ‌ల ముగిసిన మూడో సీజ‌న్‌లో కింగ్ నాగార్జున హోస్ట్ వ్య‌వ‌హ‌రించాడు. ఈ మూడవ సీజన్‌లో సింగర్ రాహుల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. టైటిల్‌ను ప్రధానం చేయడానికి మెగాస్టార్ చిరంజీవి హాజరైయారు. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజ‌న్ 4 ఎప్పుడెప్పుడు స్టాట్ అవుతుందా అని ప్రేక్ష‌కులు వెయ్యి క‌ళ్ల‌తో చూస్తున్నారు. కానీ, బిగ్ బాస్ ప్రియుల‌కు ఆ సారి నిరాశ త‌ప్పేలా లేదు.  గ‌త కొన్ని రోజులుగా ఈ సీజన్‌లో ఎవరు వ్యాఖ్యాతగా చేయనున్నరనేది ఆసక్తికరంగా మారింది. 

 

కానీ, ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 4 ఉంటుందా..? అన్న ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌చ్చాయి. ఇప్పుడు కరోనా కారణంగా ఎక్కడ పనులు అక్కడ స్తంభించిపోయాయి. దీనితో బిగ్ బాస్ షో పై ఆశలు వదులుకోవాల్సిందే అని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.  కరోనాపై మందు కనుగొన్న కూడా మరో యేడాది నుంచి రెండేళ్ల పాటు ఎక్కువ మంది గూమిగూడేటు వంటి వాటికి పర్మిషన్స్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇర పరిస్థితులు బాగున్నట్టయితే ఈ పాటికే కంటెస్టెంట్స్ కు సంబంధించి కొన్ని లీకులు కూడా మొదలయ్యిపోయి ఉండేవి. కానీ ఇప్పుడున్న అలాంటి సూచ‌న‌లు ఏమి క‌నిపించ‌డం లేదు. దీంతో అస‌లు బిగ్ బాస్ సీజ‌న్ 4 ఉంటుందా.. ఉండ‌దా.. అన్నది ఆశ‌క్తిక‌రంగా మారింది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: