టాలీవుడ్ లో ఎన్నో కామెడీ సినిమాలు తీసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు ఎస్వీ కృష్ణారెడ్డి.  అప్పట్లో అచ్చిరెడ్డి-ఎస్.వి.  కృష్ణారెడ్డి సినిమాల అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది.  యమలీల 1994లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో    'యమలీల' వంటి గోల్డెన్ జూబ్లీ హిట్ తర్వాత మనీషా ఫిలిమ్స్ బ్యానర్ లో కిషోర్ రాఠీ సమర్పణలో వి కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎస్ వి కృష్ణారెడ్డి దర్శ‌క‌త్వంలో అచ్చిరెడ్డి నిర్మించిన మరో సూపర్ హిట్ మూవీ 'ఘటోత్కచుడు‌. ఏప్రిల్ 27 (సోమ‌వారం) తో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది.  ఘటోత్కచుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1995 లో వచ్చిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఆలీ, రోజా, బేబీ నికిత, సత్యనారాయణ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఘటోత్కచుడు భూలోకానికి వచ్చి ఆపదలో ఉన్న ఒక పాపను రక్షించుట ఈ చిత్ర ప్రధాన కథాంశం.

 

ద్వాపర యుగంలో మహాభారత యుద్ధ సమయంలో ఘటోత్కచుడు మరణించబోయే ముందు ఒక పాప అతనికి సపర్యలు చేస్తుంది. ఘటోత్కచుడు ఆమె చేసిన సాయానికి ముచ్చటపడి మరేదైనా జన్మలోనైనా ఆమెకు సహాయం చేస్తానని మనసులో అనుకుంటాడు. కలియుగానికి వస్తే చిట్టి  పాప కోసం మళ్లీ భువిపైకి వస్తాడు ఘటోత్కజుడు.  ఈ మూవీలో రోబో, ఘటోత్కజుడు, మాంత్రికుడు మద్య జరిగే పోరాటం భలే ఉంటుంది.  

 

ఈ సందర్భంగా  నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ..మా మనీషా బ్యానర్ కి, కృష్ణారెడ్డికి, నాకు, మా యూనిట్ అందరికీ 'ఘటోత్కచుడు' 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. ఘటోత్కచుడు గా కైకాల సత్యనారాయణ అద్భుత నటన ఈ చిత్రానికి ప్రాణం పోసింద‌న్నారు. ఈ మూవీలో కింగ్ నాగార్జున స్పెషల్ సాంగ్ సినిమా రేంజ్ ని పెంచింది. సినిమా ప్రారంభంలో వచ్చే కురుక్షేత్రం సన్నివేశాలు ఈ సినిమాకి పెద్ద మల్టిస్టారర్ లుక్ తీసుకొచ్చాయ‌న్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: