2016లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ సోగ్గాడే చిన్నినాయనా కు సీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కనున్న విషయం తెలిసిందే. నిజానికి గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్ళవలసిన ఈ చిత్రం వాయిదాపడుతూ వచ్చింది. ఇక ఈ చిత్రం అక్టోబర్ లో ప్రారంభం కానుందని సమాచారం. కేవలం సింగిల్ షెడ్యూల్ లో  షూటింగ్ ను కంప్లీట్ చేసి డిసెంబర్ లో ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు  చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని  అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుంది. సోగ్గాడే లో కీలక పాత్రలో నటించిన రమ్యకృష్ణ, బంగార్రాజు లో నటించనుండగా నాగర్జున తోపాటు యువ సామ్రాట్ నాగ చైతన్య మరో హీరో గా నటించనున్నాడు. 
 
ఇక  ప్రస్తుతం నాగ చైతన్య ,లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. ఇక ఇటీవల వరస డిజాస్టర్ల తో సతమతవుతున్న నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ లో నటిస్తున్నాడు. రియలిస్టిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున , విజయ్ వర్మ అనే ఎన్ ఐ ఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. 
 
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్  కీలక పాత్రలో కనిపించనుంది. సాల్మన్ డైరెక్ట్ చేస్తుండగా  మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై  నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం తోనైనా నాగ్ హిట్ కొట్టి  సక్సెస్ ట్రాక్  ఎక్కుతాడో చూడాలి. ఈ సినిమాలు మాత్రమే కాకుండా హిందీ లో సూపర్ హిట్ అయిన రైడ్ రీమేక్ లో నటించడానికి  నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: