అందాల రాక్షసి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యాడు దర్శకుడు హను రాఘవపూడి. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో చేసిన క్రిష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో ఓ మంచి సక్సస్ ని అందుకున్నాడు. ఈ సినిమాతో మంచి కమర్షియల్ డైరెక్టర్ గాను పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలున్నప్పటికి తీవ్రంగా నిరాశపరచింది. సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శర్వానంద్ మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టడం కూడా కొంత మైనస్ అయింది. 

 

అయితే పడి పడి లేచే మనసు సినిమా తర్వాత హను రాఘవపూడి సినిమా ఎవరితో ఉంటుందనేది ఇంకా క్లారిటీ లేదు. మరోసారి నాని తో సినిమా ఉంటుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక గతకొన్ని రోజుల నుండి హనుకి మళయాల హీరో దుల్కర్ సల్మాన్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. మహానటి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయుఇనన దుల్కర్, ఇక్కడ డైరెక్ట్ గా సినిమా చేయాలని చాలా రోజుల నుండి ప్రయత్నాలు చేస్తున్నాడు. హను రాఘవపూడి దుల్కర్ కి కథ కూడా వినిపించాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. 

 

దుల్కర్ కి కథ కూడా నచ్చిందని లాక్ డౌన్ తర్వాత అఫీషియల్ గా న్యూస్ రానుందని తెలుస్తుంది. అయితే ఈ విషయలో మేకర్స్ నుండి గాని, దర్శకుడు గురించి గాని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. లాక్డౌన్ ముగిసిన తర్వాతే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా గురించి కన్ఫర్మేషన్ వస్తుందని అంటున్నారు. ఒకవేళ దుల్కర్ ఈ సినిమా ఒప్పుకుంటే హను రాఘవపూడి ఒకేసారి రెండు భాషల్లో సినిమాని తెరకెక్కించి సక్సస్ అయితే మాత్రం ఇక తిరుగుండదని అంటున్నారు. అందుకు కారణం హను రాఘవపూడి కి మేకింగ్ పరంగా మంచి పేరుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: