మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం "క్రాక్‌". డాన్‌ శీను, బ‌లుపు వంటి కమర్షియల్ హిట్ సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ రాబోతుంది. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ సక్సస్ ట్రాక్ లోకి రావాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడి. చుస్తుంటే ఖచితంగా అది వర్కౌట్ అయ్యేలాగానే ఉంది. ఇప్పటికే రెండు సినిమాలు కలిసి చేసిన ఈ ఇద్దరి మధ్య మంచి ట్యూనింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.

 

ఇక ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్స్ తో క్రాక్ సినిమా మీద అంచనాలు భారీగా నెలకొన్నాయి. జూలై లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పరిస్థితిని బట్టి జూలై మూడోవారం లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఇక శృతిహాసన్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే రవితేజ తో శృతిహాసన్ బలుపు సినిమాలో నటించి హిట్ అందుకుంది. దాంతో శృతిహాసన్ కూడా ఈ సినిమా హిట్ అవ్వాలన్న ఆకాకంక్షతో ఉంది. 

 

ఇక ఈ సినిమాలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా నటిస్తుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వరలక్ష్మి హీరోయిన్ గా కాదు లేడీ విలన్ గా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. లేడీ విలన్ అన్న పేరు సంపాదించుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఇప్పటికే తమిళంలో పందెంకోడి - విజయ్ సర్కార్ సినిమాలలో వరలక్ష్మి విలనిజం బాగా పాపులారిటిని సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు.

 

ఇప్పటికే తెలుగులో ఇప్పటికే తెనాలి రామకృష్ణ సినిమాలో లేడీ విలన్ గా నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వరలక్ష్మి చాలా పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతుందట. ఇక ఇదే సినిమాలో సముద్ర ఖని కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడైన సముద్ర ఖని అప్పుడప్పుడు నటుడిగాను పాపులర్ అవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక రీసెంట్ గా క్రాక్ సినిమానుండి సముద్ర ఖని లుక్ ని రిలీజ్ చేశారు. మొన్న వరలక్ష్మీ లుక్, ఇప్పుడు సముద్ర ఖని లుక్ చూస్తుంటే మన మాస్ మహారాజ ఖచితంగా హిట్ కొట్టబోతున్నాడన్న విషయం అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: