టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుగా 1996లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంటర్ అవడం జరిగింది. ఫస్ట్ సినిమాతో మంచి విజయాన్ని, పేరుని దక్కించుకున్న పవన్, ఆపై మెల్లగా అవకాశాలు అందుకుంటూ వాటిని సక్సెస్ లు గా మలుచుకుంటూ ముందుకు సాగారు. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లోని ఏడవ సినిమాగా వచ్చిన ఖుషి, 2001 ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో అతి పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. 

IHG

తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఆ సినిమా అందుకున్న విజయం తరువాత హీరోగా పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది అనే చెప్పాలి. హీరోయిన్ గా నటించిన భూమిక చావ్లా కెరీర్ కూడా ఆ సినిమాతో ఒక్కసారిగా మారిపోయింది. హృద్యమైన ప్రేమకథతో పాటు పలు కమర్షియల్ హంగులతో యువత మనోభావాలకు అద్దం పట్టేలా దర్శకుడు సూర్య ఆ సినిమాని ఎంతో గొప్పగా తెరకెక్కించడం జరిగింది. ఇక ఆ సినిమా ద్వారా తొలిసారిగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ పవన్ సినిమాకు సంగీతం అందించారు. 

IHG

ఆయన ఖుషి కి అందించిన సాంగ్స్ ఇప్పటికీ కూడా ఎక్కడో ఒకచోట వినిపిస్తూ ఉంటాయి అంటే అవి ఎంత సక్సెస్ అయ్యాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక స్క్రీన్ పై పవన్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, అలానే పవన్, భూమికల జోడి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, అదిరిపోయే విజువల్స్, ఫైట్స్, ఎంటర్టైన్మెంట్ వెరసి ఖుషి సినిమాకి అంతగొప్ప విజయాన్ని అందించడం జరిగింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయి నేటితో సక్సెస్ఫుల్ గా 19 ఏళ్ళు పూర్తి కావడంతో పవన్ ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో దానిని పలు ట్రెండ్స్ సృష్టించి పరిగెత్తిస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: