టాలీవుడ్ లో చేసినవి తక్కువ సినిమాలే అయినా చేసిన హడావుడి మాత్రం ఎక్కువగా ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్ ది. ఆమె చేసిన సినిమాల్లో పెద్దగ అవిజయాలు కూడా ఏమీ లేవు అనే చెప్పాలి. అయినా సరే పాప హడావుడి మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా ఆమె హడావుడి చేయడం మన౦ చూస్తూ ఉంటాం. చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద పదాలు వాడుతూ సోషల్ మీడియాలో కాస్త హుషారుగా ఉంటుంది. ప్రస్తుతం మన తెలుగులో హీరోయిన్స్ కి కొన్ని రంగాల్లో ఈమె కనపడే దైవం. 

 

ముందు నుంచి జిమ్ విషయంలో ఆసక్తి చూపించే ఈమె ఆ రంగంలోనే పెట్టుబడులు పెట్టింది. జిమ్స్ ని మొదలుపెట్టింది మంచి లాభాలను కూడా ఆమె సంపాదించింది. ఇప్పుడు ఆమె బాటలోనే మరికొందరు నడుస్తున్నారు. జిమ్ రంగంలో ఆమె సహకారం తో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉంది సమంతా సహా అనుష్క. ఈ రంగం మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని వారు ఇద్దరూ భావిస్తున్నారని సమాచారం. ఆ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రకుల్ ప్రీత్ సింగ్ సలహాలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. 

 

ఇప్పటికే ఆమెను కలిసిన ఈ ఇద్దరు కూడా ఎక్కువగా పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే అనుష్క ఈ రంగంలో పెట్టుబడి పెట్టడానికి గానూ కొంత మొత్తాన్ని కూడా కేటాయించింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఆమె ఇక్కడ పెట్టుబడిని భారీగా పెడుతుందని కాని ఆమెలో కొంత భయం ఉండటం వలన వెనక్కు తగ్గుతుంది అని అంటున్నారు. ప్రస్తుతం అనుష్క సమంతా ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి చేతిలో చెరో సినిమా మాత్రమే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: