విజయ్ దేవరకొండ సినిమాలు మాత్రమే కాదు అతడి తీరు కూడ చాల విభిన్నం. గత కొన్ని సంవత్సరాలుగా మండు వేసవిలో అందరికీ ఐస్ క్రీమ్స్ పంచి తన ప్రత్యేకతను చాటుకున్న విజయ్ ఇప్పుడు కరోనా విషయంలో కూడ ఎవరు ఊహించని సేవా కార్యక్రమాన్ని ప్రారంభించి ఫిలిం ఇండస్ట్రీ వర్గాలకు ఊహించని షాక్ ఇచ్చాడు. 

 

కరోనా సమస్యతో షూటింగ్ లు ఆగిపోవడంతో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విభాగాల కార్మీకులను అదేవిధంగా చిన్నచిన్న వేషాలు వేసుకునే ఆర్టిస్టులను ఆదుకోవడానికి ప్రారంభించిన కరోనా క్రైసిస్ కమిటీకి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అంతా తమతమ విరాళాలను ఇప్పటికే అందచేసారు. విజయ్ దేవరకొండ మాత్రం ఈ విషయమై మౌనంగా ఉండటంతో అతడి పై విపరీతంగా సెటైర్లు కూడ పడ్డాయి.


అయితే ఇప్పుడు విజయ్ ఏకంగా 1.3 కోట్లతో ఒక ఫండ్ ను ఏర్పాటు చేసి కోవిద్-19 కరాళ నృత్యంతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు తమ సంస్థ ఆదుకోబోతోంది అంటూ ప్రకటన ఇవ్వడమే కాకుండా తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్ కు ఆకలితో అలమటించే బాధితులు అప్లయ్ చేసుకుంటే తన టీమ్ సభ్యులు నేరుగా ఆ బాధిత కుటుంబాలకు కనీస అవసరాలైన సరుకులు ఫుడ్ ఐటమ్స్ అందచేస్తామని ఈ కార్యక్రమం కరోనా సమస్య పూర్తిగా తీరేదాకా తాను కొనసాగిస్తాను అంటూ నిన్న ఉదయం ప్రకటన ఇచ్చిన కొద్ది సేపటికే మెగా కాంపౌండ్ సన్నిహితులకు ఈ న్యూస్ షాకింగ్ గా మారింది.


ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుతం పెద్దన్న పాత్రలో చిరంజీవి కొనసాగుతున్నాడు. దీనితో చిరంజీవి ఏర్పాటు చేసిన సిసిసి కి ఇండస్ట్రీకి సంబంధించిన చిరంజీవి సన్నిహితులు మాత్రమే కాకుండా మెగా స్టార్ ను వ్యతిరేకించే వ్యక్తులు కూడ సిసిసి కి తమవంతు విరాళాలు అందచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఒక్క రాజశేఖర్ తప్ప మిగిలిన హీరోలు అంతా చిరంజీవి కనుసన్నలలో కొనసాగుతూ మెగా కాంపౌండ్ కు తమ విధేయతను ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి ఏర్పాటు చేసిన ‘సిసిసి’ పట్టించుకోకుండా విజయ్ దేవరకొండ తనకు తాను ప్రత్యేకంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడంతో పాటు తన ఫౌండేషన్ లో అదేవిధంగా తన ప్రొడక్షన్ హౌస్ లో తన ‘రౌడీ వేర్’ ఎపరల్ బ్రాండ్ సంస్థలో కరోనా సమస్య వల్ల దెబ్బ తిన్న కుటుంబాలలోని వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తాను అని ప్రకటించిన విజయ్ ఆశయాలు బాగున్నా ఇన్ని ఆశయాలకు కేవలం ఒక కోటి రూపాయలు సరిపోతాయా అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి అన్నమాటలు వినిపిస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: