తెలుగులో ఉన్న అండర్ రేటెడ్ డైరెక్టర్లలో దేవకట్టా కూడా ఒకరు. టాలెంట్ ఉండి, మంచి సినిమాలు తీయగలిగినా కూడా సక్సెస్ మాత్రం తెచ్చుకోలేకపోతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కెరీర్ సక్సెస్ మీదే ఆధారపడుతుంది. వరుసగా విజయాలు వస్తుంటే పేరు, డబ్బు వస్తుంది. దేవకట్టా మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని అందరికీ తెలుసు. ఆయన తీసిన ప్రస్థానం మూవీ కమర్షియల్ వర్కౌట్ కాకపోయినప్పటికీ, ఆ సినిమా నచ్చినవాళ్ళు చాలా మంది ఉన్నారు.

 

 

అయితే ప్రస్థానం సినిమా ఆడకపోవడానికి గల కారణాలను దేవకట్టా ఈ విధంగా చెప్పాడు. ప్రస్థానం సినిమా రిలీజ్ అయిన టైమ్ లో బాక్సాఫీసు వద్ద బాలయ్య సింహాతో పాటు ప్రభాస్ డార్లింగ్ సినిమా కూదా రిలీజైంది. దాంతో ఈ రెండు సినిమాలతో పోటీపడి నిలవలేకపోయింది. అయినా ప్రస్థానం పట్ల నేనెప్పుడూ సంతృప్తిగానే ఉన్నాను. మంచి సినిమా తీశానని ఇప్పటికీ గర్వంగా ఉంటుందని తెలిపాడు. 

 

 

అలాగే ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అయింది. ఇక్కడ ఫ్లాప్ అయిన మూవీ హిందీలో రీమేక్ కి వెళ్ళిందంటే దేవకట్టా ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఎంచుకున్నాడో అర్థం అవుతుంది. సంజయ్ దత్ మెయిన్ లీడ్ గా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ కూడా ఫ్లాప్ గా నిలిచింది. అయితే హిందీ ప్రేక్షకులకి తగ్గట్టుగా సినిమాలో మార్పులు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. అయితే హిందీలో ఫ్లాప్ అవ్వడానికి కూడా అటువంటి రీజన్సే చూపుతున్నాడు దేవకట్టా..

 

 

దేవకట్టా అనే కాదు ప్రస్థానం సినిమా నచ్చిన వాళ్ళు ప్రతీ వాళ్ళు అదే చెప్తారు. సినిమా రిలీజ్ టైమ్ సరిగ్గా ఉంటే దాని రేంజ్ మరోలా ఉండేదని అంటుంటారు. ఈ సినిమాలో సాయికుమార్ నటనకి ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతారు. అలాగే సందీప్ కిషన్ విలనిజాన్ని చాలా చక్కగా పండించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: