పాయల్ రాజ్ పుత్… పరిచయం అవసరం లేని పేరు. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. గ్లామర్ షో మరియు రొమాంటిక్ సీన్ లకి ఏమాత్రం అడ్డు చెప్పకుండా గ్లామర్ ప్రియులని సైతం ఆకర్షించింది. అయితే తరువాత ఈమెకు వరుస ఆఫర్లు వచ్చి బిజీగా ఉంటుంది అనుకుంటే… అనుకున్నంత బిజీగా అయితే లేదు. అందుకు కారణం ఈమెకు ఎక్కువగా అలాంటి పాత్రలే రావడం. మితి మీరిన లిప్ లాక్ లు, గ్లామర్ షో, రొమాన్స్ కు సంబంధించిన స్క్రిప్ట్ లే వస్తున్నాయి అని వాటిని పక్కన పెట్టేసింది. 'RDX 100' సినిమాలో 'Rx 100' ని మించి అందాలను ఆరబోసినప్పటికీ క్రేజీ ప్రాజెక్టులు మాత్రం దక్కించుకోలేకపోయింది. 'వెంకీమామ' సినిమాలో నటించింది. సినిమా హిట్ అయ్యింది.. తన నటనకు మంచి మార్కులే పడ్డాయి.. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. చివరికి రవితేజ సరసన 'డిస్కోరాజా' సినిమాలో నటించినప్పటికీ మళ్ళీ పరాజయం పలకరించింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పాయల్ తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

 

లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన పాయల్ అందరు సెలబ్రెటీలలాగే సోషల్ మీడియాతో టైమ్ పాస్ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో ముచ్చటించిన పాయల్ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒక నాటీ నెటిజన్ 'నీకు rx 100 హీరో కార్తికేయతో డేటింగ్ చేసే ఛాన్స్ వస్తే ఏమి చేస్తావ్' అని ప్రశ్నించాడు. దీనికి పాయల్ సమాధానం చెప్తూ.. నేను కార్తికేయ చాలా మంచి స్నేహితులం.. తనతో అదే బంధాన్ని కొనసాగిస్తా అని సమాధానం చెప్పింది. అంతేకాకుండా ఇమిడియేట్ గా విజయ్ దేవరకొండతో ఛాన్స్ వస్తే నటిస్తానని.. రజినీకాంత్ సరసన కూడా యాక్ట్ చేయాలని ఉందని.. కోహ్లీ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. పాయల్ రాజ్ ఫుట్ ఆల్రెడీ తన చిన్ననాటి స్నేహితుడు నటుడైన సౌరభ్ ధింగ్రాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: