టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఎక్కువగా వ్యాపారం మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరూ కూడా ఇప్పుడు వ్యాపారాల్లో తమ ప్రతిభ చూపిస్తున్నారు. మహేష్ బాబు అయితే ఇప్పుడు వ్యాపారం లో దూసుకుపోతున్నాడు. ఎక్కడా కూడా అతను వెనక్కు తగ్గడం లేదు. భార్య నమ్రత సహకారంతో పలు రంగాల్లో అతను పెట్టుబడులు పెట్టాడు. తన సినిమాలను తానే నిర్మిస్తున్న మహేష్ బాబు ఇప్పుడు సరికొత్త వ్యాపారాల దిశగా అడుగులు వేస్తున్నాడు. విదేశాల్లో వ్యాపారాలను విస్తరించాలి అని భావిస్తున్నాడు. 

 

ప్రస్తుతం మన తెలుగులో చాలా మంది హీరోలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అలాగే మహేష్ బాబు ఇప్పుడు బట్టల రంగం మీద ఎక్కువగా దృష్టి పెట్టే యోచనలో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో జనాలకు ఫ్యాషన్ ఎక్కువగా అపెరిగింది కాబట్టి ఇప్పుడు వాటి మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉండే అవకాశం ఉందని భావించిన మహేష్ ఇప్పుడు ఆ రంగం మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టే యోచనలో ఉన్నాడు. అటు నమ్రత కూడా ఎక్కువగా ఈ రంగం మీద పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఉంటాయని భావిస్తుంది. 

 

ఇప్పటికే పలు సంస్థలతో కూడా వీళ్ళు చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ముఖ్యంగా మెన్స్ దుస్తుల మీద ఎక్కువగా దృష్టి పెట్టారని అంటున్నారు. విదేశాల మాదిరి గా మన దేశంలో కొన్ని కొన్ని కొత్త రకాలను ఎప్పటికప్పుడు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటి కే బట్టల రంగంలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. అతన్ని ఇప్పటికే మహేష్ టీం సంప్రదించి చర్చలు కూడా జరిపిందని అతను ఈ రంగంలో దూసుకుపోవడం తో మహేష్ ఇప్పుడు ఆ విధంగా అడుగులు వేస్తున్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: