పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగానే కాదు సింగర్ గా కూడా తనని తానూ ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు. చేస్తున్న సినిమాలో ఎక్కడో ఒకచోట చిన్న సాకి అయినా పవన్ గొంతు సవరించుకోవాల్సిందే. పవర్ స్టార్ పాట పాడితే ఆ ఊపు ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. తమ్ముడు సినిమాలో తాడిచెట్టెక్కలేవు సాంగ్ తో పవన్ ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ సినిమాలో పవన్ పాడటం సినిమా సూపర్ హిట్ అవడంతో తన ప్రతి సినిమాలో పవన్ పాట పాడేస్తున్నాడు. ఇక ఆ తర్వాత సీన్ లో భాగంగా ఖుషీలో బైబయ్యె బంగారు రమణమ్మ అంటూ ఒక సాంగ్ పాడాడు పవర్ స్టార్. 

 

ఆ సీన్ లో ఆ పాట ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక జానీ లో నువ్వు సారా తాగితే రన్నో అన్న సాంగ్ తో పాటుగా రావోయి మా కంట్రీకి అంటూ అలరించాడు. ఆ సినిమాను పవన్ కథ, కథనం, డైరక్షన్ చేశాడు. జానీ సినిమా కమర్షియల్ పరంగా ప్లాప్ అయినా పవన్ కు తన కెరియర్ లో నచ్చిన సినిమాల్లో అది ఒకటని ఎప్పుడు చెబుతుంటారు. ఇక ఆ తర్వాత గుడుంబా శంకర్ సినిమాలో కిళ్ళీ కిళ్లీ సాంగ్ లో గొంతు కలిపారు పవన్. 

 

పంజా సినిమాలో పాపారాయుడు అంటూ బ్రహ్మీని టీజ్ చేసే సాంగ్ కూడా పవన్ ముందు అందుకుంటాడు. ఆ తర్వాత వేరే సింగర్ పాడుతారు. గబ్బర్ సింగ్ లో పిల్లా సాంగ్ కూడా పవన్ పాడారు. అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా సాంగ్ చాల పాపులర్ అయ్యింది. ఆ సినిమాలో ఈ పాట పవర్ స్టార్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఇక అజ్ఞాతవాసిలో కూఆ పవన్ కొడుకా కోటేశ్వర రావు పాట పాడారు. హీరోగానే కాదు పవన్ సింగర్ గా కూడా తన టాలెంట్ చూపిస్తాడు. అయితే అది సరదాకే అయినా ఆ సీన్ కు అదే కరెక్ట్ అనిపించేలా ఉంటాయి ఆ సాంగ్స్. మరి రానున్న రోజుల్లో పవన్ ఇలా తన సాంగ్స్ తో కూడా అలరిస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: