ప్రస్తుతం సెలబ్రిటీలు సెక్సువాలిటీ గురించి ఓపెన్‌గా మాట్లాడేస్తున్నారు. బాలీవుడ్‌ లోనూ ఈ కల్చర్‌ బాగా కనిపిస్తోంది. హిందీ సినిమా పరిస్థితే ఇలా ఉంటే ఇక హాలీవుడ్ ఏ రేంజ్‌లో ఉండాలి. అందుకే పలువరు హాలీవుడ్‌ స్టార్స్ ఏకంగా అడల్ట్ సెక్స్‌ ఇండస్ట్రీలో బిజినెస్‌ చేస్తున్నారు. సెక్స్‌ టాయ్స్‌ ను అమ్మే కంపెనీలను స్థాపించారు హాలీవుడ్‌ తారలు.

 

ప్రముఖ హాలీవుడ్‌ నటి, గాయని, లిరిసిస్ట్‌, టీవీ పర్సనాలిటీ కాండీ బుర్రూస్‌ కూడా ఇదే బిజినెస్‌ చేస్తోంది. ఈ భామ బెడ్ రూమ్‌ కాండీ పేరుతో సెక్స్‌ టాయ్స్‌ ను తయారు చేసే కంపెనీని నిర్వహిస్తోంది. అంతేకాదు తన కంపెనీలో తయారయ్యే ఉత్పత్తులను తాను తన భర్త స్వయంగా టెస్ట్ చేసిన తరువాత సేల్ చేస్తామంటూ బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇస్తోంది ఈ భామ.

 

పలు అమెరికన్‌ టెలివిజన్‌ షోలో సందడి చేసిన అందాల భామ ఫరా అబ్రహం కూడా అదే బిజినెస్‌ చేస్తోంది. ది టీన్‌ మామ్ అనే సంస్థలో కలిసి బిజినెస్ చేస్తున్న ఈ భామ టాయ్స్ తయారు చేసేందుకు ఏకంగా తన ప్రైవేట్ పార్ట్స్ తరహాలో మౌల్డ్‌ లు రూపొందించింది. అతి తక్కుద ధరకే ఈ టాయ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది ఫరా. మరో హాలీవుడ్‌ నటి కొకో ఆస్టిన్‌ కూడా ఇదే బిజినెస్‌లో ఉంది. కొకొలిసియస్‌ పేరుతో ఆన్‌లైన్‌ ద్వారా వైబ్రేటర్స్‌, మాసజర్స్‌, ఆయిల్స్‌ను విక్రయిస్తోంది.

 

లవ్‌ అండ్ హిప్‌ హాప్స్‌ ఫేమ్‌ జోస్‌లైన్‌ హెర్నాండెజ్‌ కూడా ఇదే బిజినెస్ చేస్తోంది. రియాలిటీ టీవీ స్టార్‌గా పాపులర్ అయిన ఈ బ్యూటీ సైడ్ బిజినెస్‌గా సెక్స్‌ టాయ్స్‌తో పాటు పలు వెయిట్ లాస్ ప్రాడక్ట్స్ ను కూడా అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: