కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రళయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. కంటికి కనిపించని కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకీ మృతుల సంఖ్య.. బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు అయోమయానికి గురవుతున్నాయి. ప్రజలు 'కరోనా' అనే పేరు వింటేనే భయపడిపోతున్నారు. సాధారణ జలుబు, తుమ్ములు దగ్గులు వచ్చినా కూడా కరోనా సోకిందేమో అని కంగారు పడిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగానే ఉంది... మరణాల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌భుత్వం ఇప్పటికే విధించిన లాక్ డౌన్ మే నెల వరకు పొడిగించింది.

 

కరోనా బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్ప‌టికే పలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేపడుతున్నాయి. సినీ ప్ర‌ముఖులు, సెలబ్రిటీలు కూడా ప్రజలకు వివిధ రూపాల్లో సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది సెలబ్రెటీలు వీడియోల ద్వారా కరోనా వ్యాప్తి నివారణకి కృషి చేస్తున్నారు. కరోనా తీవ్రత పెరుగుతున్న ఈ తరుణంలో మహమ్మారి మన దరికి చేరకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వైద్య సిబ్బంది మరియు పోలీసులు సూచనలు ఇస్తుంటే.. కొంతమంది వారి పై కూడా దాడులు చేసిన సంఘటనలను కూడా మనం విన్నాం.

 

కాగా అలాంటి సంఘటనల పై తాజాగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘ఈ కరోనా కష్టకాలంలో మన ఆరోగ్యం కోసం మన ప్రాణాల కోసం కష్టపడుతున్న వైద్య సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పై వాదులాడంతో పాటు కొన్ని చోట్ల దాడి చేసిన దురదృష్టకరమైన వార్తలు కూడా ఇటీవలే వచ్చాయి. మన కోసం వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తోన్న వైద్య మరియు పోలీస్ సిబ్బంది పట్ల మనం ఎంతో కరుణతో ,ఎంతో కృతజ్ఞత చూపించాలి, వాళ్ళు వారి ఇళ్లకు, కుటుంబాలకు దూరంగా ఉండి, మనల్ని కాపాడటానికి ఎంతో శ్రద్ధతో పని చేస్తున్నారు. వారిని మనము ఎంతో గౌరవించాలి’ అని మంచు విష్ణు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని.. సినీ ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడపటానికి ఈ ఖాళీ టైంను స్పెండ్ చేస్తున్నారు. ఇక మంచు విష్ణు హీరోగా వస్తోన్న ‘మోసగాళ్లు’ జూన్ లో వచ్చే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: