అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం గడిచిపోతుంది అప్పటికీ ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తోంది. ఎంతో మంది కొత్త హీరోయిన్లు వస్తున్నారు పోతున్నారు కానీ కాజల్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే గత పదేళ్ల నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు ఏ బిజినెస్ లో అడుగు పెట్టింది లేదు. సినిమాలతో బాగానే సంపాదిస్తున్నప్పటికీ బిజినెస్ ల వైపు మాత్రమే మొగ్గు చూపలేదు కాజల్ అగర్వాల్. ఇక సినిమాల పైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. తన అందం అభినయంతో ఆకట్టుకుంటూనే మరోవైపు తన హాట్ హాట్ అందాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. 

 

 

 ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన మరోసారి నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య  సినిమాలో కాజల్ అగర్వాల్ దాదాపు ఖరారు అయినట్లే అని టాక్ బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇన్ని రోజుల వరకు సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ డిఫరెంట్ బిజినెస్ పై దృష్టి పెట్టింది. దాంట్లో పెట్టుబడి కూడా పెట్టింది. ఎవరూ ఆలోచింనంత  డిఫరెంట్ గా ఆలోచించి ఈ బిజినెస్ లోకి అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్. 

 

 

 ఇంతకీ కాజల్ అగర్వాల్ అడుగుపెట్టిన కొత్త బిజినెస్ ఏమిటి అంటారా... ఇండీడ్  సంస్థ. ప్రస్తుతం ఆన్లైన్ లో ఎన్నో జాబ్ పోర్టల్ వున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కూడా చాలామందికి జాబ్ కి సంబంధించిన సమాచారాన్ని చూపించే విధంగా ఉంటుంది ఇండీడ్ . అయితే దీంట్లో పార్టనర్ గా చేరింది కాజల్ అగర్వాల్. ఇంతకీ కాజల్ అగర్వాల్ ఇందులో పెట్టుబడి ఎంత డబ్బు పెట్టింది అంటే ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. కేవలం తన ఇమేజ్ ను మాత్రమే పెట్టుబడిగా పెట్టి ఇండీడ్  కి ప్రమోషన్ చేయడం మొదలు పెట్టింది. ఏదేమైనా కాజల్ కొత్త బిజినెస్ మాత్రం అదుర్స్ అంటున్నారు నెటిజన్లు

మరింత సమాచారం తెలుసుకోండి: