ఇలియానా గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఆమె సన్నని నడుము ఎంతగా పాపులారిటీ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదారు సంవత్సరాల పాటు తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో ఉర్రూతలూగించిన ఇలియానా తల్లి సమీరా టాలెంటెడ్ ఫ్యాషన్ డిజైనర్. నిజానికి ఇలియానా యొక్క అన్నీ డ్రెస్సులను తన తల్లి సమీరానే డిజైన్ చేసేది. అయితే తన తల్లి నైపుణ్యాన్ని వినియోగించుకొని ఒక బట్టల షాపు ఎందుకు పెట్టకూడదు అనే యోచన ఆమెకు ఒకానొక సందర్భంగా వచ్చింది. అప్పటికి ఇలియానా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. తన చేతుల్లో కోట్ల రూపాయలు కూడా తిరుగుతున్నాయి. దాంతో ఒక బట్టల దుకాణం పెట్టేందుకు ఆమె ముందడుగు వేసింది. హైదరాబాద్ నగరంలో తన పేరుతోనే ఒక బట్టల దుకాణాన్ని ఆరంభించింది.


ఎత్నిక్ నుండి పశ్చిమ, ఇండో-వెస్ట్రన్ దుస్తులు అన్నీ తన షాపులో లభించేవి. ఇలియానా తన తల్లితో కలిసి ఒక రోజు పెద్ద ఫ్యాషన్ షో లో తమ దుకాణానికి సంబంధించిన బట్టలన్నీ ప్రదర్శనలు చేసారు. అలాగే ఇలియానా తన అమ్మ సొంతంగా డిజైన్ చేసిన వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేసి తన దుకాణం గురించి ప్రచారం చేసుకుంది. ఏదేమైనా తన తల్లి ఇలియానా బట్టల దుకాణాన్ని విజయవంతంగా నడిపించడం తోపాటు తన బిడ్డ సినీ కెరియర్ విజయవంతం అయ్యేందుకు ఎంతో సహకరిస్తుంది.


ఫ్రీ టైం లో వీళ్లద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. ఎక్కడికి వెళ్లినా తన తల్లిని తనతో పాటు తీసుకోవడం ఇలియానా కు నాకు బాగా అలవాటు. ఇలియానాకు తల్లి అయినా కూడా సమీరా చాలా స్టైలిష్ గా 40 సంవత్సరాల మహిళ లాగా ఎప్పుడూ యంగ్ గా కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ కే పరిమితమైన ఇలియానా... సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోని ఒక హీరోతో ఎఫైర్ పెట్టుకొని ఆ రిలేషన్ షిప్ కుదరక ఇక సౌత్ సినిమాలకు స్వస్తి చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: