తారాచౌదరి తెలుగు రాష్ట్రాలో ఈ పేరు తెలియన వారు ఉండరు.  అప్పట్లో తారాచౌదరి బుల్లితెరపై చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.   పలువురు పెద్ద రాజకీయ నేతలకు, బడా పారిశ్రామికవేత్తలకు, సినీ సెలెబ్రిటీకు అమ్మాయిలను సరఫరా చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి.  అప్పట్లో మీడియాలో ప్రతిరోజూ తారా చౌదరి పేరు మారుమోగింది.  కొంత కాలం తర్వాత అవన్నీ పూర్తిగా సర్ధుమణిగాయి. అప్పుడప్పుడు ఒకటీ రెండు సార్లు ఈమె పేరు బయట వినిపించింది.  తాజాగా మరోసారి తారాచౌదరి పేరు వార్తలకెక్కింది. దీనికి కారణం... తన భర్తను పామూరు ఎస్ఐ అకారణంగా కొట్టారంటూ ఆమె మీడియా ముందుకు వచ్చింది.  

 

 

ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ సీరియస్ గా కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భర్తను పామూరు ఎస్ఐ అకారణంగా కొట్టారంటూ ఆమె మీడియా ముందుకు వచ్చింది. నిత్యావసర సరుకులు, ఐదు నెలల తన బిడ్డకు మందులు తీసుకువచ్చేందుకు ఉదయం 8 గంటల సమయంలో బయటకు వెళ్లిన తన భర్త రాజ్‌కుమార్‌ను పామూరు ఎస్ఐ చంద్రశేఖర్ అకారణంగా కొట్టి   కేసును పెట్టారని ఆరోపించింది.  

 

తన భర్త రాజ్‌కుమార్‌ను ఇదే అదనుగా అదుపులోకి తీసుకుని కొట్టారని, అక్కడితో ఆగకుండా నాటుసారా తాగించి, దానిని అక్రమంగా రవాణా చేస్తున్నాడని కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలిసి అడిగేందుకు వెళ్తే తనపైనా ఎస్సై దుర్భాషలాడాడని, లాకప్‌లో వేస్తానని బెదిరించాడని తెలిపింది.లాక్‌డౌన్ సమయంలో తన సమస్యలు, ప్రజల ఇబ్బందులు ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లటమే దీని అంతటికి కారణమన్నారు. ఎస్సై కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సై చంద్రశేఖర్‌పై పై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తారా చౌదరి తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: