సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీలో హీరో, హీరోయిన్లు సినిమాల్లో న‌టించ‌డ‌మే కాక కొన్ని సైడ్ బిజినెస్‌లు కూడా చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్లు, నటులు ఇలా కొత్త బిజినెస్‌లు మొదలుపెట్టారు. అందులో కొంత మంది యాడ్స్ చేస్తారు. మ‌రికొంత మంది కొన్ని ప్రాడ‌క్ట్స్ కు బ్రాండ్ ఎంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. వాస్త‌వానికి సినీరంగంలో ప్రస్తుతం ఉన్న స్థానానికి భరోసా ఉండదు. సినీ కెరీర్‌లో ఎప్పుడు ముందుంటారో ఎప్పుడు వెనుకపడతారో ఎవరికీ తెలియదు. కేవలం సక్సెస్‌లు ఉన్నంత వరకే ఆదరణ ఉంటుందనేది అందరికీ తెలిసిందే.

 

అందుకే హీరోల‌తో పాటు స‌మానంగా.. హీరోయిన్లు కూడా వివిధ వ్యాపారాలు చేస్తూ భవిష్యత్తులో ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పక్క ప్లానింగ్‌తో దూసుకుపోతున్నారు. భవిష్యత్తుకు భరోసా ఉండేలా పెట్టుబడులు పెడుతున్నారు. అందులో గోవా బ్యూటీ ఇలియానా కూడా ఒక‌రు. దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. స్టార్ హీరోలందరితో నటించి టాప్ ప్లేస్ కి రీచ్‌ అయింది. ముఖ్యంగా పోకిరి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుండి తన స్టార్ డమ్ కొనసాగించింది. కోటికి పైగా పారితోషికం తీసుకున్న తొలి తెలుగు హీరోయిన్ కూడా ఇలియానానే అంటే అతిశ‌యోక్తి కాదు. 

 

ఇక తెలుగు సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌లో కూడా మంచి అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ.. అక్కడ కూడా మంచి హిట్లు అందుకుంది ఈ గోవా బ్యూటి. కానీ, ప్ర‌స్తుతం ఇలియానా సినిమాల‌కు దూరంగా ఉంటుంది. అయితే ఈమెకు సైడ్ బిజినెస్‌లు కూడా ఉన్నాయి. ఇలియానా హైదరాబాద్‌లో బ్యూటీ పార్లర్‌, స్పా సెంట‌ర్‌ను సొంతంగా నెలకొల్పింది. మ‌రియు ఇక్కడే ఒక మాల్‌లో ఆధునిక ఫ్యాషన్‌ స్టోర్ కూడా స్టార్ట్ చేసింది. ఇక వీటిని ఆమె తల్లి నీరజా చూసుకుంటుంది. ఇలియానా కేవ‌లం సినిమాల్లోనే కాకుండా బిజినెస్‌లో కూడా బాగానే స‌క్సెస్ అయింద‌ని చెప్పుకోవాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: