ఒకప్పుడు బుల్లితెరపై తమ సత్తా చాటి తర్వాత వెండి తెరపై ఎన్నో సినిమా ఛాన్సులు దక్కించుకున్న వారిలో ఒకరు హర్షవర్థన్.  టెలివిజన్ రంగంలో ‘అమృతం’ సీరియల్ అంటే ఎంత క్రేజ్ ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  అమృతం క్యారెక్టర్ తో  హర్షవర్ధన్ తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు.  ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించిన హర్షవర్ధన్ తర్వాత సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నాడు.  ప్రస్తుతం సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. నేను మంచి బోజన ప్రియుడినని దాంతో బాగా లావైపోయానని చాలా మంది కామెంట్స్ చేశారు.  

 

ఇక సన్నబడటానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావని.. తెల్లవారు జామున ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోయేది. పల్స్ రేట్ పెరిగిపోతున్నటుగా అనిపించేది. కంగారు పడిపోయి హాస్పిటల్ కి వెళితే, అంతా నార్మల్ గా ఉందని చెప్పేవారు. అప్పుడప్పు ఇలా జరగడంతో ఒకదశంలో ఈ జీవితం ఎందుకురా బాబూ అనుకొని చావాలని అనిపించేది.  అలాంటి పరిస్థితుల్లోనే నా సన్నిహితుడు సుధాకర్ బాబుగారు, నా దినచర్య ను గురించి అడిగి తెలుసుకున్నారు. నా సమస్యకి ప్రధాన కారణం వాటర్ తక్కువగా తాగడమేనని చెప్పారు.  

 

ఇక ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ కుమార్ గురించి మాట్లాడుతూ.. ఆయనకి ఏం కావాలనే విషయంలో ఆయన చాలా క్లారిటీతో ఉంటారు. నేను నాగార్జున గారికి ఒక నటుడిగానే తెలుసు.. మొదటి సారిగా విక్రమ్ కుమార్ నన్ను ఒక రైటర్ గా ఆయనకు పరిచయం చేశారు. మొహమాటానికి నేను చెప్పిన సీన్స్ విన్నారు .. ఆ తరువాత ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. అన్ని సీన్స్ నాతోనే రాయించమని చెప్పారు అంటూ చెప్పుకొచ్చాడు.  విచిత్రం ఏంటంటే మామూలూ డైలాగ్స్ రాసుకొని తీసుకువెళ్ల మంచి ఇంప్రేషన్ కొట్టేశానని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: