మన తెలుగులో ఇప్పుడు కొందరు హీరోల సినిమాల మీద ప్రేక్షకులకు ఒక ప్రత్యేక ఆసక్తి ఉందీ అనే మాట అక్షరాలా నిజం. కొందరు హీరోల సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. సినిమా మీద పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు కూడా కొందరు హీరోల విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు ఈ కొందరు హీరోల మీద బాలీవుడ్ హీరోలు ప్రత్యేక దృష్టి పెట్టారని అంటున్నారు. ఏ హీరో అయితే తెలుగులో పాపులర్ అయ్యాడో... 

 

ఆ హీరోతో ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలను చేసే ఆలోచనలో అక్కడి హీరోలు ఉన్నారని సమాచారం మన చిన్న హీరోల మీద కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎక్కువగా దృష్టి పెట్టారని వారి సినిమాల్లో పెట్టుబడి పెట్టడమే కాదు వారి సినిమాల్లో నటించాలని తద్వారా తమ సినిమాలను తమ మార్కెట్ ని ఇక్కడ పెంచుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, ని మహేష్ బాబు ని కొందరు కలిసి చర్చలు కూడా జరిపారు. మహేష్ బాబు బాలీవుడ్ లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 

 

ఆయనతో అక్కడ సినిమా చెయ్యాల ని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. లాభాలు నష్టాల మీద ప్రస్తుతం దృష్టి పెట్టకుండా  మరో విధంగా దృష్టి పెట్టి సినిమాలను చేస్తే భవిష్యత్తు లో కచ్చితంగా లాభాలు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం మన తెలుగు హీరోలు కూడా మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నాలే ఎక్కువగా చేస్తున్నారు. టాలీవుడ్ లో సినిమాలు అన్నీ కూడా దాదాపుగా కమర్షియల్ గానే ఉంటున్న సంగతి తెలిసిందే. దీనికి బాలీవుడ్ హీరోల సహకారం తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: