మాయాబజార్.. పేరు వింటూనే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, మహానటి సావిత్రి కనిపించేస్తుంది కదా! అవును మరి.. అప్పట్లో.. ఇప్పట్లో ఎప్పటికి అద్భుతమైన సినిమా మాయాబజార్.. ఎన్ని సార్లు చుసిన చూడాలి అనిపించే సినిమా మాయాబజార్.. ఇంకా అలాంటి అద్భుతమైన సినిమా పేరుతో హైదరాబాద్ లో ఓ రెస్టారెంట్ ఉంది.. 

 

IHG

 

హైదరాబాద్ లో ఎక్కడ ఉందో తెలుసా? సికింద్రాబాద్ దగ్గరలో ఈ రెస్టారెంట్ ఉంది. ఇంకా అలాంటి అద్భుతమైన ఈ రెస్టారెంట్ గురించి ఇంకో ప్రత్యేకత ఉంది.. ఏంటో తెలుసా? ఈ రెస్టారెంట్ మన టాలీవుడ్ నటుడుది.. ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు అండి.. సై సినిమాలో మంచి పాత్రలో నటించిన శశాంక్ రెస్టారెంట్ ఇది. 

 

IHG

 

ఈ రెస్టారెంట్ ని అల్లరి నరేష్ ఓపెన్ చేశాడు.. ఎంతో అద్భుతమైన పేరు ఉన్న రెస్టారెంట్ లోపల కూడా అలాగే ఉంటుంది... అచ్చం మాయాబజార్ లానే ఉంటుంది.. సింపుల్ ఇంటీరియర్స్ తో ఫ్యామిలీస్ ని బాగా అట్ట్రాక్ట్ చేసే రెస్టారంట్ ఇది.. ఇది ముఘాలై ఫుడ్ ఉన్న రెస్టారెంట్... ఫ్యామిలీస్ ని.. సినీ ప్రియులను ఎంతో ఆకట్టుకుంటుంది. 

 

IHG

 

ఇంకా ఈ రెస్టారెంట్ లో ఆహారం కూడా చాలా బాగుంటుంది.. చెప్పాలి అంటే రెస్టారెంట్ అంత ఒక మాయ.. అక్కడికి వెళ్లి తిన్న  అనుభూతి ఇంకెక్కడా రాదు.. ఎంతో అద్భుతమైన ఆహారం ఇక్కడే దొరుకుతుంది. శశాంక్ సినిమాలలో తక్కువ కనిపించినప్పటికీ ఇలా బిజినెస్ మాత్రం మంచిగా రన్ చేస్తున్నాడు.. 

 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: