లాక్ డౌన్ వల్ల సినిమా రంగం తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ఈపాటికే విడుదలకావల్సిన సినిమాల విడుదల ఆగిపోయింది. షూటింగ్ లు రద్దయ్యాయి.  ఈపరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. అయితే ఈ పరిస్థితులను ఓటిటి లు క్యాష్ చేసుకునేందుకు చూస్తున్నాయి. అందులో భాగంగా విడుదలకు సిద్ధంగా వున్నా సినిమాలను థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ లో విడుదల చేసుకునేందుకు ఆఫర్ చేస్తున్నాయి. ఇందుకు గాను భారీ మొత్తాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాయి. 
 
తాజాగా బాలీవుడ్ మచ్ అవైటెడ్ మూవీ 83 ని దక్కించుకోవడానికి ఓ ప్రముఖ ఓటిటి అన్ని భాషలకు  గాను 140కోట్లు ఆఫర్ చేసిందని, సినిమా కూడా డైరెక్ట్ గా డిజిటల్ లో విడుదలకానుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే దీని పై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. 83 థియేటర్లలో విడుదలైన తరువాతే డిజిటల్ లోకి వస్తుందని  కాకపోతే  అందుకు చాలా సమయం పడుతుందని అన్నారు. అన్ని కుదిరితే  సినిమాను సెప్టెంబర్ లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
లెజండరీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా  కబీర్ ఖాన్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ , కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా కపిల్ దేవ్ భార్య రోమి దేవ్ పాత్ర లో రణ్వీర్ సతీమణి దీపికా పదుకొనే కనిపించనుంది. వీరితోపాటు ఈచిత్రంలో ప్రముఖ మాజీ క్రికెటర్ల పాత్రల్లో తమిళ నటుడు జీవా ,పంకజ్ త్రిపాఠి,బోమన్ ఇరానీ తదితరులు నటిస్తున్నారు. హిందీతోపాటు తెలుగుతమిళం లో విడుదలకానున్న ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్ టైన్మెంట్స్, విబ్రి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగులో 83కి  నాగార్జున  సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా తమిళం లో కమల్ హాసన్ విడుదలచేయనున్నాడు.త్వరలోనే ఈసినిమా నుండి ట్రైలర్ విడుదలకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: