తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజాల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వర రావు నట వారసత్వాన్ని నాగార్జున ఎంత ఘనంగా చాటారో తెలిసిన విషయమే. గత జనరేషన్ లోని నలుగురు సూపర్ స్టార్స్ లో ఒకరైన నాగార్జునకు తెలుగు సినిమాల్లో ప్రత్యేక స్థానం ఉంది. కెరీర్లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ఘనత నాగార్జున సొంతం. ఆయన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి ఘరానాబుల్లోడు. ఈ సినిమా విడుదలై నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.  

IHG

 

కె. రాఘవేంద్ర రావు స్వీయ నిర్మాణంతో పాటు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1995 ఏప్రిల్ 27న విడుదలైంది. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. నాగార్జున చేసిన మాస్ యాక్టింగ్, కామెడీ అక్కినేని అభిమానులను ఆకట్టుకుంది. సెకండాఫ్ లో వచ్చే ఫ్యామిలీ కంటెంట్ ఆడియన్స్ ను మెప్పించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. నాగార్జున సరసన రమ్యకృష్ణ, ఆమని హీరోయిన్లుగా నటించారు. నాగార్జునకు ఇటువంటి ఫ్యామిలీ కంటెంట్ బేస్డ్ మూవీస్ బాగా కలిసొస్తాయని చెప్పాలి. ఈ సినిమాలో నాగార్జున మాస్ డైలాగ్ డిక్షన్ తో చెప్పిన ‘సుర్రు సుమ్మై పోద్ది’ అనే మేనరిజమ్ బాగా పేలింది.

IHG

 

ఆర్కే ఫిలిం అసోసియేట్స్ పతాకంపై కె. కృష్ణమోహన్ రావు ఈ సినిమా నిర్మించారు. కీరవాణి సంగీత సారధ్యంలోని పాటలన్నీ సూపర్ హిట్టే. శోభన్ బాబుతో సోగ్గాడు సినిమా తర్వాత ఈ సినిమాలోనే బిందెల మధ్య ‘భీమవరం బుల్లోడా’ పాట చిత్రీకరణ చేశారు రాఘవేంద్ర రావు. ఈ సినిమా 10 సెంటర్లలో డైరక్ట్ గా, మరో 10 సెంటర్లలో షిప్టులతో 100 రోజులు రన్ అయి శతదినోత్సవం జరుపుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: