టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో రామ్ చరణ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే అతను మాత్రం తనకు తాను గా పాపులర్ అవ్వాలని భావించి చిరంజీవి ని పక్కన పెట్టి మరీ ప్రయత్నాలు చేసాడు. అన్నీ అనుకున్నట్టు జరిగాయి ఇప్పుడు నిర్మాతగా కూడా అతను సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం మన తెలుగులో రామ్ చరణ్ కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అతని సినిమాలను అభిమానులు ఎక్కువగా ఆదరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న సినిమాల మీద ఇతర హీరోలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 

 

టాలీవుడ్ లో ఇంతః ధైర్యంగా ఇప్పుడు సినిమాల్లో పెట్టుబడి పెడుతున్న యువ హీరో ఎవరూ లేరు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది తన సినిమా ల విషయంలో ముందు నుంచి కూడా జాగ్రత్తగా ఉండే రామ్ చరణ్ ఇప్పుడు తన తండ్రి సినిమాలకు నిర్మాతగా చేయవద్దు అని భావిస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఇప్పుడు అతని తో సినిమా చేయడానికి గానూ కొందరు నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వారితో తాను సినిమాలు చేసుకుని కొంత కాలం పాటు నిర్మాతగా సినిమాలు చేయవద్దు అని భావిస్తున్నాడట. 

 

నిర్మాతగా ఇప్పుడు అతను నష్టాల్లోనే ఉన్నాడు అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ వెనక్కు తగ్గుతున్నాడు అని అంటున్నారు. తన సినిమాల్లో అవసరం అయితే తాను పెట్టుబడి పెట్టాలి గాని తన తండ్రి సినిమాల్లో తాను పెట్టుబడి పెట్టకుండా ఉండటమే మంచిది అనే భావనలో ఉన్నాడని అంటున్నారు. అందుకే తన తండ్రితో కొత్త సినిమా కథలకు సంబంధించి ఎలాంటి చర్చలు జరపడం లేదని అంటున్నారు. మరి ఎంత వరకు నిజమో...

మరింత సమాచారం తెలుసుకోండి: