టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రస్తావిస్తే సాహసానికి ఊపిరి అని అంటారు. ఒకప్పుడు ఫైట్స్, గూఢాచారి, సీఐడీ, కౌబాయ్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు.  సూపర్ స్టార్ కృష్ణ వచ్చాకే తెలుగు సినీ పరిశ్రమలో వెస్టన్ స్టైల్ వచ్చిందని అంటారు.  ఇక ఆయన కెరీర్ లో ఎన్నో ప్రమాదాలు, కష్టాలు ఎదుర్కొన్నారు.  ఓ  వైపు సినిమాల్లో నటిస్తూనే నిర్మాణ రంగం వైపు చూపు మరల్చారు.  సాధారణంగా హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మూవీస్ రిమేక్ చేయడం చూస్తుంటాం. కానీ యాభై ఏళ్ల క్రితమే ఓ తెలుగు సినిమా హాలీవుడ్‌లో డబ్బింగ్‌ కావడమే కాకుండా పెద్ద విజయాన్ని సాధించింది. అంత గొప్ప సినిమా ఎంటా అని అనకుంటున్నారా... ఏ హీరో  అనుకుంటున్నారా? ఆయనే సాహసాలకు పెట్టింది పేరు సూపర్ స్టార్ కృష్ణ.

 

 టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ మూవీ సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు.  తొలి తెలుగు కౌబాయ్‌ మూవీ 1971లో రూపొందిన ఈ మూవీ కె.ఎస్‌.ఆర్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. మెకన్నాస్‌ గోల్డ్‌, గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ లాంటి హాలీవుడ్‌ సినిమాల స్ఫూర్తితో రచయిత ఆరుద్ర ఈ చిత్ర కథను సిద్ధంచేశారు.  అయితే అప్పటి వరకు ఈ తరహా సినిమాలు రాలేదే.. ఒకవేళ ఇది నిర్మించాలన్నా అత్యంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని చాలా మంది అన్నారట.

 

ఈ చిత్ర నిర్మాణాన్ని తలపెట్టిన కృష్ణ, ఆదిశేషగిరిరావులను చాలా మంది వద్దని వారించారట. కానీ, సినిమా విజయం సాధించడం అసాధ్యమని భయపెట్టారట. అడ్డంకులను లక్ష్యపెట్టకుండా ఎన్నో వ్యయప్రయాసల కోర్చి కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు చిత్ర యూనిట్ కాస్త టెన్షన్ పడ్డారట.. కానీ మూవీ రిజల్ట్ చూసిన తర్వాత సంతోషాలకు అవధులు లేకుండా పోయాయట. ఏడు లక్షల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం 32 లక్షలకుపైగా వసూళ్లను సాధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: