ప్రస్తుతం మన తెలుగులో హీరోయిన్ ల కొరత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోల తో కూడా సినిమాలు చేయడానికి మంచి హీరోయిన్ ఇప్పుడు తెలుగులో దొరకడం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చిన్న హీరోలకు కొత్త అమ్మాయిలూ దొరుకుతున్నా అగ్ర హీరోలకు మాత్రం హీరోయిన్ దొరకడం అనేది చాలా కష్టంగా మారింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఏ హీరోయిన్ కూడా అగ్ర హీరో పక్కన మ్యాచ్ అవ్వడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. మన తెలుగు హీరోయిన్ లు చాలా మంది పనికి రాకుండా పోయారు. 

 

మన తెలుగులో పుట్టిన వాళ్ళు ఇక్కడ ఆదరణ లేక తమిళంలో సినిమాలో చేస్తున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు మన వాళ్ళు బాలీవుడ్ నుంచి కొందరు హీరోయిన్ లను తీసుకుని వచ్చే ఆలోచన చేస్తున్నారు. అలియా భట్ కి ఇప్పుడు ఆదరణ తెలుగులో పెరుగుతుంది. ఆమె ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమె మహేష్ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కోసం ఆమె గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది అని అంటున్నారు. 

 

ఇది ఇలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ లో అగ్ర హీరోయిన్ గా ఉన్న దీపిక తో మన తెలుగులో సినిమా చేయించే ఆలోచనలో ఉన్నారట. ఇక్కడ హీరోయిన్ లు ఎవరూ సరిగా లేకపోవడం అయితే పూజ లేకపోతే రష్మిక అని ఇప్పుడు వాళ్ళను పక్కన పెట్టి బాలీవుడ్ లో క్రమంగా పాపులర్ అవుతున్న వాళ్ళను తీసుకుని రావాలని యోచిస్తున్నట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతం తెలుగులో వరుసగా కమర్షియల్ సినిమాలే వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: