ఇప్పుడు రామ్ చరణ్ చేసే సినిమాల మీద టాలీవుడ్ జనాలకు ఆసక్తి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ధ్రువ సినిమా నుంచి అతను చేసే సినిమాల మీద కొందరు దర్శక నిర్మాతలు కూడా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలను ఎక్కువగా నిర్మాతలు గమనిస్తున్నారు. అందులో రామ్ చరణ్ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. 

 

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అతను ఏ సినిమా చేస్తాడు అనేది ఎవరికి స్పష్టత లేదు. ఈ సినిమా తర్వాత అతను చేసే సినిమా సుకుమార్ తో అని అంటున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కొంత విరామం తీసుకుని అతను సుకుమార్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళడానికి రామ్ చరణ్ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో అతని పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది అంటున్నారు. 

 

గ్లామర్ పాత్రలను అసలు వద్దు అని భావిస్తున్నాడు ఈ మెగా హీరో. అందుకే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. కథ రంగస్థలం సమయంలోనే సుకుమార్ వివరించాడు అని రామ్ చరణ్ అందుకు ఓకే చెప్పాడు అని అంటున్నారు. మరి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో చిరంజీవి కూడా ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక కొత్త అమ్మాయిని పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: