త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ లో ఎంత డెప్త్ ఉంటుందో.. అతని మూమెంట్స్ కూడా అంతే డెప్త్ లో ఉంటాయి. అందుకే నితిన్ లాంటి హీరోలు త్రివిక్రమ్ ను గురూజీ అని పిలుస్తుంటారు. కానీ ఈ గురూజీ మాత్రం సీనియర్స్ విషయంలో ఒకరకంగా ఆలోచిస్తున్నాడని.. వాళ్లను తక్కువ చేస్తున్నాడని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు. 

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతుంటే ప్రేక్షకులంతా చెవులప్పగించి వింటుంటారు. పంచ్ మాస్టర్ ప్రతీ మాటను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ మాటలతోనే బోల్డంత అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే డైలాగ్ కి అభిమానగణాన్ని పెంచుకున్న పంచ్ మాస్టర్ పై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. సీనియర్స్ కు సరైన రెస్పెక్ట్ ఇవ్వడం లేదని మాట్లాడుకుంటున్నారు. 

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవి, వెంకటేశ్ ను డైరెక్ట్ చేయబోతున్నాడని చాన్నాళ్ల క్రితమే ఎనౌన్స్ మెంట్ వచ్చింది. వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో మూడేళ్ల క్రితమే ఓ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసింది హారికా అండ్ హాసిని క్రియేషన్స్. అయితే ఈ మూవీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. కానీ వెంకీ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశాక త్రివిక్రమ్ రెండు సినిమాలు తీశాడు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేశాడు. 

 

వెంకటేశ్ ప్రాజెక్ట్ 2017లో ఎనౌన్స్ అయింది. ఈ ప్రకటన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత తీశాడు త్రివిక్రమ్. ఇక ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురములోకి వెళ్లాడు. ఇప్పుడు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ స్టోరీ రెడీ చేస్తున్నాడు.

 

కాంబినేషన్ తో సినిమాలు హిట్ అవ్వవు. కంటెంట్ తో కలెక్షన్లు వస్తాయి. పర్ ఫెక్ట్ స్టోరీ అయినప్పుడే సినిమాలు సెట్స్ కు వెళ్తాయి. అందుకే త్రివిక్రమ్ కూడా కథల కోసం కొంచెం ఎక్కువ టైమ్ తీసుకుంటాడు. అయితే సీనియర్ హీరోల కోసం ఎక్కువ టైమ్ తీసుకోవడం, మెగా ప్రాజెక్ట్స్ ని పక్కన పెట్టడం చాలా మందికి డిస్కషన్ పాయింట్ గా 
మారుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: