స్టార్ హీరోల కొడుకులు లాంచ్ అవుతున్నారంటే హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. స్టార్ డైరెక్టర్లతో మీటింగ్ లు, స్టోరీ సిట్టింగ్ లు ఇలా బోల్డంత హంగామా ఉంటుంది. కానీ తమిళ స్టార్లు మాత్రం వాళ్ల వారసులను లాంచ్ చేసేందుకు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. తెలుగు రీమేక్స్ తో వారసులని లాంచ్ చేస్తున్నారు. 

 

వందల కోట్ల వసూళ్లతో కోలీవుడ్ ను రూల్ చేస్తున్నాడు విజయ్. ఇళయదళపతిగా తమిళనాట మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈ హీరో వారసుడి ఎంట్రీపై చాలా రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ను మురుగదాస్ లాంచ్ చేస్తాడని ఓ సారి, జూనియర్ దళపతి కోసం శంకర్ కథ సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడీ కుర్రాడు ఉప్పెన రీమేక్ తో లాంచ్ కాబోతున్నాడనే టాక్ వస్తోంది. 

 

చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా లాంచ్ అవుతోన్న సినిమా ఉప్పెన. ఈ మూవీలో తమిళస్టార్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. సేతుపతికి ఈ స్టోరీ బాగా నచ్చిందట. ఈ కథతో విజయ్ కొడుకు సంజయ్ లాంచ్ అయితే అద్భుతంగా ఉంటుందని ఫీలయ్యాడట. ఇక అనుకోవడం ఆలస్యం ఉప్పెన రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడట విజయ్ సేతుపతి. 

 

విజయ్ సేతుపతి రీమేక్ రైట్స్ తీసుకున్న వెంటనే విజయ్ ను కూడా కాంటాక్ట్ అయ్యాడని సమాచారం. ఉప్పెన రీమేక్ తో సంజయ్ ని లాంచ్ చేసేందుకు ఒప్పించాడని తెలుస్తోంది. ఇక తెలుగులో ప్లే చేసిన విలన్ క్యారెక్టర్ ను తమిళ్ లోనూ సేతుపతే చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక విజయ్ కొడుకు సంజయ్ ఇప్పుడు కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్నాడు. ఈ కోర్స్ పూర్తయ్యాక ఉప్పెన రీమేక్ ని లాంచ్ చేస్తారేమో చూడాలి.

 

విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ కూడా తెలుగు రీమేక్ తోనే ఎంట్రీ ఇచ్చాడు. ఫిల్మ్ మేకింగ్ కోర్స్ మధ్యలో ఉండగానే ఫారిన్ నుంచి చెన్నై వచ్చి ఆదిత్య వర్మగా మారాడు. తెలుగునాట సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కింది ఆదిత్య వర్మ. 

మరింత సమాచారం తెలుసుకోండి: