సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన సినిమా పోకిరి. 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో అతిపెద్ద సంచలన విజయాన్ని అందుకుంది. పలు మాస్ యాక్షన్, కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ విలన్ గా నటించడం జరిగింది. ఇక ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదనే చెప్పాలి. తొలిసారిగా రూ. 70 కోట్ల మార్క్ ని అందుకున్న తెలుగు సినిమా పోకిరి. ఒకరకంగా ఇటీవల బాహుబలి రెండు భాగాలు ఎంత పెద్ద విజయం అందుకున్నాయో మనకు తెలిసిందే. 

IHG

దాని ప్రకారం బాహుబలి కి ముందు బాహుబలి కి తర్వాత అని ఎలాగైతే అంటామో, అదేవిధంగా పోకిరికి ముందు పోకిరి తర్వాత అని కూడా అంటుంటారు సినిమా వాళ్ళు. ఆ విధంగా ఎంతో గొప్ప విజయం అందుకున్న ఈ సినిమా ద్వారా దర్శకుడు పూరీ జగన్నాథ్ కొన్ని కోట్ల రూపాయల మేర ఆర్జించినట్లు అప్పట్లో వార్తలు ప్రచారం అయ్యాయి. మహేష్ సోదరి మంజుల తో కలిసి పూరి ఈ సినిమాని నిర్మించడం జరిగింది. సినిమా రిలీజ్ అవటం, ఆపై ఊహించని రేంజ్ లో అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు భారీ స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టడం జరిగింది. అలానే ఈ సినిమాకు సంబంధించి ఆడియో, వీడియోతో పాటు పలు రకాల డబ్బింగ్ మరియు ఇతర అన్ని రకాల రైట్స్ కలుపుకొని పూరి జగన్నాథ్ మొత్తంగా రూ.150 కోట్ల రూపాయలకు పైగానే ఆర్జించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. 

 

మరి ఇందులో ఎంతవరకు పూర్తిగా వాస్తవం ఉందో తెలియదు కానీ, పూరి మాత్రం ఊహించని రేంజ్ లో భారీ స్థాయిలో ఈ సినిమా ద్వారా కూడబెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఆ తర్వాత దేశముదురు, చిరుత, బిజినెస్ మాన్ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న పూరి, ఆపై ఇటీవల ఇస్మార్ట్ శంకర్ వరకు కూడా వరుసగా పరాజయాలను చవి చూడడం జరిగింది. అప్పట్లో పూరి పోకిరి ద్వారా ఆర్జించిన ఆదాయం ఇప్పటివరకు కూడా ఆయనను చాలా వరకు కాపాడుతూ వచ్చింది అనే ఒక టాక్ కూడా ఉంది. ఇక ఆతర్వాత మహేష్, పూరిల కాంబో లో వచ్చిన బిజినెస్ మేన్ కూడా హిట్ జరిగింది. అయితే అప్పటినుండి ఇప్పటివరకు వీరిద్దరి కాంబోలో మరొక సినిమా రాకపోవడంతో ఎప్పుడెప్పుడు వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ సినిమా చేస్తారా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూపులు చూస్తున్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుందో తెలియాలంటే కాలమే దానికి సమాధానం చెప్పాలి......!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: