టాలీవుడ్ కి అందమైన మనసున్న మహా రాణి.. నటనలో.. సేవ గుణంలో.. స్నేహంలో.. బాధ్యతల విషయంలో.. ఏలాంటి విషయంలో అయినా సమంత సూపరే.. టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత.. ప్రత్యేకమైన పాత్రలను చేసి ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్న నటి సమంత.. 

 

పదేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుత సినిమాలు అందించింది ఈ భామ.. అంతేకాదు.. జెస్సి సినిమా చూసి సమంతపై మనసు పాడేసుకున్న వారు ఇంకెందరో.. ఎక్సపోజ్ లేకుండానే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న పాప సమంత.. అలాంటి సమంతనే ఎందుకు టాలీవుడ్ కి మహారాణి అనేది మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

సమంతకు మొదటి సినిమా నుండి అన్ని సినిమాలు హిట్ అవుతూనే వచ్చాయి.. చెప్పాలి అంటే సమంత సక్సెస్ రేట్ ఎక్కువ. 

 

ఇంకా ఎంతోమంది స్టార్ హీరోస్.. పవన్ కళ్యాణ్, సూర్య, మహేష్ బాబుఎం ఎన్టీఆర్ లతో ఎక్కువ సినిమాలు చేసిన నటి  ఈమె. 

 

సమంత ఒక్కటే.. ఒకే సంవత్సరంలో రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న నటి. 

 

సమంత కేవలం నటి మాత్రమే కాదు.. మనసున్న బంగారు తల్లి.. అనాథ పిల్లలకు చదువు, తిండి అన్ని చూసుకోదలి ప్రత్యుష ఫౌండేషన్ స్థాపించింది. అంతేకాదు తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంతానే ఉంది. 

 

సమంతలో ఓ ప్రత్యేకత ఉంది.. అది ఏంటంటే? చిన్న పిల్లల నటించగలదు.. పిల్లల తల్లిగాను నటించగలదు.. భామల కూడా నటించగలదు.. ఏ పాత్రలో అయినా అద్భుతంగా నటించే శక్తి కేవలం ఒక సమంతకే ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు.. 

 

నటులు అంటూనే ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నారు అని చూస్తాం.. ఇంకా అలానే ఎక్సపోజ్ లేకుండా మంచి దుస్తులలో కనిపించే నటి సమంత.. అది స్క్రీన్ పైన అయినా.. రెడ్ కార్పెట్ పైన అయినా. 

 

ఏ నటుడితో అయినా అద్భుతంగా నటిస్తుంది.. వాళ్ళకు సరిపడేలా.. అది 20 ఏళ్ళ వారైనా 40 ఏళ్ళ వారైనా. 

 

సమంత లక్కీ చార్మ్.. ఎందుకు అనుకుంటున్నారా? అక్కినేని ఇంటికి కోదలయ్యింది.. స్టార్ యాక్టర్లు అయినా ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలు, మహేష్ బాబుతో మూడు సినిమాలలో నటించింది. ఇంతకంటే లక్కీ ఎవరు ఉంటారు అబ్బా!

 

ఇంకా సమంతకు 18 అవార్డులు వచ్చాయి.. బెస్ట్ యాక్టర్స్ గా. 

 

పెళ్లికి ముందు లవ్ స్టోరీస్ లో నటించే సమంత పెళ్లి తర్వాత తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలోనే నటిస్తుంది. ఇంతకంటే గొప్ప నటి.. మనసున్న నటి గురించి ఎం చెప్పగలం. 

మరింత సమాచారం తెలుసుకోండి: