కుందనపు బొమ్మ సమంత తెలుగు, తమిళ భాషల్లో దగ్గర దగ్గరగా 50 సినిమాలకు చేరువలో ఉంది. ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే దానికి పూర్తి న్యాయం చేసే సమంత సినిమాలో ఉంది అంటే ఆ సినిమా మ్యాక్సిమం హిట్ అన్నట్టే లెక్క. అయితే ఈగ సినిమా టైం లో దర్శధీరుడు రాజమౌళిని కూడా షాక్ అయ్యేలా చేసింది సమంత. అదెలా అంటే అప్పటివరకు తెలుగులో మూడు సినిమాలే చేసింది సమంత. ఏమాయ చేసావే, బృందావనం, దూకుడు. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈగ సినిమాలో సమంతను హీరోయిన్ గా అనుకోగా ఆ పాత్రలో ఆమెని తీసుకోవాలా లేదా అని ఆలోచించాడట జక్కన్న. 

 

ఎలాగోలా సమంతని తీసుకోగా ఆమె సహజ నటనతో రాజమౌళి షాక్ అయ్యాడట సినిమా బాగా వచ్చిందని శాటిస్ఫై కాగా సినిమాను థియేటర్ లో చూసిన రాజమౌళికి మరో షాక్ ఇచ్చిందట సమంత. అప్పటికి కేవలం మూడు సినిమాలే చేసినా సమంత కనబడగానే ఆడియెన్స్ అంతా కేకలు వేయడం మొదలుపెట్టారట. అది చూసిన రాజమౌళి షాక్ అయ్యాడట. అప్పుడే ఆడియెన్స్ లో సమంతకు ఉన్న క్రేజ్ ఏంటో రాజమౌళి అర్ధమైంది. సమంత ఎంపిక ఈగకు పర్ఫెక్ట్ అని అప్పుడు ఫీల్ అయ్యారట. అలా సమంత క్రేజ్ చూసి రాజమౌళి షాక్ అయ్యాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

 

ఇక కెరియర్ పరంగా సమంత చాలా పద్ధతిగా వెళ్తుంది. పెళ్ళికి ముందు కమర్షియల్ సినిమాల్లో నటనతో పాటుగా గ్లామర్ షో కూడా చేసిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. ఎలాంటి పాత్ర ఇచ్చినా సమంత చేయగలడు అనేలా చేసుకుంది సమంత. అందుకే ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది.         

 

మరింత సమాచారం తెలుసుకోండి: