టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ అయింది సమంతా. ఎప్పుడో పదేళ్ళ క్రితం ఆమె తొలి సినిమా చేసినా అప్పటి నుంచి అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది. ఎంత మంది హీరోయిన్ లు వచ్చినా సరే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది సమంతా. ఈ క్రమంలో ఎందరో అగ్ర దర్శకులతో ఆమె వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. అందులో ప్రధానంగా చెప్పుకునే దర్శకుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. 

 

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో చేసిన సినిమాల్లో ఆమెను తీసుకున్నాడు. ఆమె త్రివిక్ర౦ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా ఆ సినిమాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అత్తారింటికి దారేది సినిమాలో ఆమె నటన ప్రేక్షకులకు బాగా నచ్చింది అనేది వాస్తవ౦. ప్రధానంగా ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు ప్రేక్షకులకు బాగానే నచ్చాయి అనే విషయ౦ తెలిసిందే. ఇక ఆ తర్వాత తర్వాత ఆమె త్రివిక్రమ్ సినిమాలో రెగ్యులర్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. అల్లు అర్జున్ తో చేసిన సన్ ఆఫ్ సత్య మూర్తి సినిమాలో కూడా ఆమెను తీసుకున్నాడు. 

 

సినిమా కూడా సూపర్ హిట్ అవ్వ్వడమే కాకుండా ఆమె కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అనే విషయ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమాల కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో త్రివిక్రమ్ టాప్ దర్శకుడి గా ఉండగా సమంతా సీనియర్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది. యువ హీరోయిన్ లు రావడం తో ఆమె ప్రభ బాగా తగ్గింది అనేది వాస్తవం.  ప్రస్తుతం ఆమె సినిమాలు చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: