టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అతని తో సినిమా చెయ్యాలి అనుకునే దర్శకులు నిర్మాతలు హీరోయిన్ లు ఎందరో మనకు కనపడుతూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోల్లో అతను కూడా ఒకడు. ఏ సినిమా అయినా సరే జాగ్రత్తగా చేస్తూ వెళ్తున్నాడు. ఇక అతని తో సినిమా చెయ్యాలి అనుకునే హీరోయిన్ ల సంఖ్య టాలీవుడ్ లో ఎక్కువగానే ఉంది అందులో చాలా మంది హీరోయిన్ లకు అవకాశాలు రాలేదు. ఇక ఇది పక్కన పెడితే ఎన్టీఆర్ కెరీర్ లో ఒక హీరోయిన్ మాత్రం చాలా లక్కీ. 

 

ఆమె ఎవరో కాదు అక్కినేని వారి కోడలు సమంతా. ఆమె తో అతను చేసిన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా హిట్ అయ్యాయి, బృందావనం సినిమాకు ముందు ఆయన చేసిన సినిమాఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఆమె తో ఆ సినిమా చేయగా అది మంచి విజయం సాధించింది. ఇలా కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్ కి ఆమె లక్కీ హీరోయిన్ అయింది అని అంటారు. జనతా గ్యారేజ్ సినిమాలో ఆమె చాలా బాగా నటించింది. ఎన్టీఆర్ పక్కన ఆమె చేసిన నటనకు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ కి ఆమె లక్కీ హీరోయిన్ అని అంటూ ఉంటారు జన౦. 

 

ఎన్టీఆర్ ఆమె తో సినిమా చేయడానికి గానూ చాలా సందర్భాల్లో దర్శకులను అడిగాడు అని చెప్తూ ఉంటారు. ఆమెను ఎన్టీఆర్ ఒక లక్కీ హీరొయిన్ గా చూసాడు అనేది టాలీవుడ్ జనాల మాట ఏది ఎలా ఉన్నా సరే ఆమె మాత్రం ఎన్టీఆర్ తో చేసిన మూడు నాలుగు సినిమాలు అన్నీ కూడా విజయం సాధించి అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: