అక్కినేని నట వారసుడిగా 'అఖిల్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు అఖిల్. ఆ సినిమా ఆశించినంత విజయం సాదించనప్పటికీ అఖిల్ స్క్రీన్ ప్రెజన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీకి 'మనం' లాంటి చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రెండో సినిమాగా 'హలో' చిత్రంలో నటించాడు. ఈ సినిమా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకొనే ఎలిమెంట్స్ లేకపోవడంతో సెన్సిబుల్ సినిమాగా మిగిలిపోయింది. మూడో సినిమాగా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అఖిల్ ని నిలబెట్టలేకపోయింది. ఇప్పుడు నాలుగో సినిమాను డైరెక్ట‌ర్‌ బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్నాడు అఖిల్. దాదాపు తెలుగు ప్రేక్ష‌కులు అంతా మ‌రిచిపోయిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. 

 

ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో చిత్ర షూటింగు నిలిచిపోయింది. కాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా ఔట్ పుట్ తెప్పించుకుని.. రఫ్ ఎడిటింగ్ అయిన సినిమా మొత్తాన్ని నాగార్జున చూశారట. సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ హ్యాపీగా ఫీల్ అయినట్లు.. ముఖ్యంగా అఖిల్పూజా హెగ్డేల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ చాలా బాగా వచ్చాయని.. బొమ్మరిల్లు భాస్కర్ బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా బాగా హ్యాండిల్ చేశాడని నాగ్ ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: