రాజమౌళి అనౌన్స్ మెంట్ తో  ఒకపక్క మహేష్ బాబు ఫ్యాన్స్  పండగచేసుకుంటుంటే.. మరో స్టార్ హీరో ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి మీద అలిగారు. ప్రజెంట్ చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా అయిపోక ముందే మహేష్ బాబుతో తన నెక్ట్స్ సినిమా అని అనౌన్స్ చేశాడు జక్కన్న. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్  తో ఫామ్ లో ఉన్న  సూపర్ స్టార్, నాన్ స్టాప్ హిట్స్ తో కంటిన్యూ అవుతున్న రాజమౌళి కలిసి సినిమా చేస్తున్నారంటేనే.. ఆ క్రేజీ కాంబినేషన్ కి టాలీవుడ్ లో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

 

అసలు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్టు చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. కానీ అన్ ఎక్స్ పెక్టెడ్ గా ఎవ్వరికీ చిన్నహింట్ కూడా ఇవ్వకుండా సడెన్ గా సూపర్ స్టార్ తో సినిమా అనౌన్స్ చేసేసరికి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచో కథలు అల్లేసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబందించి రాజమౌళి ఆల్రెడీ తన తండ్రి విజయేంద్రవర్మతో కథా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

 

రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడని  ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుంటే.. మరో వైపు మెగా ఫ్యాన్స్ మాత్రం మూతి ముడుచుకున్నారు. మహేష్ తో సినిమా చేస్తే.. వీళ్లకేంటి అంత ఉలుకు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇక్కడ మహేష్ తో సినిమా చేస్తున్నందుకు కాదు.. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యనందుకు అసంతృప్తిగా ఉన్నారు  ఫ్యాన్స్.

 

ఎవ్వరు అడక్కుండానే మహేష్ తో సినిమా చేస్తున్నానని చెప్పాడు రాజమౌళి.. మరి టాలీవుడ్ మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్‌ తో సినిమా ఎప్పుడు అని అడిగితే.. అబ్బే .. ఆయనకు నాకు అంతగా కుదరదని చెప్పాడు. అదేంటని అడిగితే.. ఆయన పాలిటిక్ లోకి వెళ్లిపోయి.. సినిమాలు తొందరగా చెయ్యమని హడావిడి చేస్తారు. కానీ నేనేమో సంవత్సరాలు సంవత్సరాలు సినమాలు చేస్తాను. అందుకే.. ఆయనకు నాకు అంతగా సింకవ్వదు అందుకే.. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యలేను అని చెప్పాడు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: