సోషల్ మీడియాలో విపరీతమైన  ఫ్యాన్స్ ను సంపాదించుకుంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లో ఉండి ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలో టిప్స్ చెపుతుంది.. ఎప్పుడూ ఫిట్ నెస్ పాఠాలు చెప్పే రకుల్.. ఈ సారి కిచెన్ లెసన్ మొదలు పెట్టింది.

 

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ అందం, ఆరోగ్యం విషయంలో పక్కాగా ఉంటుంది.. ఫిట్ నెస్ అంటే పడి చస్తుంది... ఎలాంటి  పరిస్థితులు ఉన్నా.. టైమ్ లేకున్నా.. ఫిట్‌నెస్‌ విషయంలో అస్సలు నెగ్లెట్ చేయదు రకుల్.. హెల్త్ కు  అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. అంతేకాకుండా అందం, ఆరోగ్యం కోసం చక్కటి చిట్కాలు పాటిస్తు. ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో వాటిని అభిమానులతో పంచుకుంటుంది ఈ భామ. రీసెంట్ గా  కరోనా వైరస్ దాడి నుంచి తప్పించుకోవడానికి డ్రింక్ ఎలా చేయాలో సలహాలు ఇస్తోంది రకుల్.

 

ప్రస్థుతం కరోనా కనికరం లేకుండా కమ్ముకొస్తోంది. ఇమ్యూనిటీ పవర్ లేకుంటే ఈ వైరస్ తొందరగా వచ్చే ప్రమాదం ఉంది. మార్కెట్‌లో ఎన్ని రకాల హెల్త్, ఎనర్జీ డ్రింకులు ఉన్న సహజ సిద్ధంగా తయారు చేసుకొనే కిచెన్ డ్రింకులే ఆరోగ్యానికి రక్ష అని పెద్దల మాటగా చెపుతుంది రకుల్. ప్రస్తుతం లాక్‌డౌన్ పిరియడ్‌లో ఇంటికే పరిమితమైన రకుల్.. ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా.. నేచురల్‌గా ఉండే ఓ డ్రింక్ ను తయారు చేసుకొని.. ఆ చిట్కాను తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌కు చెప్పారు. 

 

రకుల్ తయారు చేసిన  డ్రింక్ లో  500 మిల్లీ లీటర్ల నీళ్లు, అందులోకి సరిపోయేంత అల్లం, మిరియాలు, పసుపు, లవంగాలు, దాల్చిన చెక్క పాత్రలో వేసుకొని మరగబెట్టుకోవాలి. ఆ ద్రావణ మిశ్రమం సగం అయ్యేంత వరకు మరగబెట్టాలి. దానికి ఆర్గానిక్ తేనే కలిపి తాగితే కెఫిన్ ఉండే కాఫీ కంటే మంచి టేస్ట్ ఉంటుందని చెపుతోంది హీరోయిన్.. ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్ నే తింటూ.. రోగ నిరోధక శక్తి పెంచుకుని.. ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ గా ఉండాలని ఆరోగ్య సూత్రాలు చెపుతోంది రకుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: