ఎప్పుడో వచ్చిన  సీనియర్లు ఇప్పటికీ  జూనియర్లతో పోటీ పడుతున్నారు. జూనియర్లను మించి పోయి ఈ సీనియర్ సూపర్ స్టార్లు వరుస పెట్టి సినిమాలతో బిజీ అయిపోతున్నారు. కుర్ర హీరోలు కూడా సక్సెస్ కోసం తెగ కష్టపడి పోతుంటే సిక్స్ టీ ప్లస్ సీనియర్ హీరోలు మాత్రం సై అంటూ  సత్తా చాటుతున్నారు. వరుస సినిమాలు లైన్ లో పెడుతూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. తెలుగు లో ఒకప్పుడు టాప్ స్టార్ హీరోలుగా ఉన్న హీరోలు... ఇప్పటికీ  బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో డైరీలు నింపేసుకున్నారు.

 

టాలీవుడ్ లో  సీనియర్ హీరో చిరంజీవి.. ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. ఒక పక్క యంగ్ హీరోలు నెమ్మది గా సినిమాలు చేస్తుంటే ఈ సీనియర్ స్టార్ మాత్రం.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు లైన్లో పెట్టేశారు. సైరా నర్సింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అయ్యిందో లేదో.. మరో సినిమాని స్టార్ట్ చేసేశారు చిరంజీవి. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ..  152 వ సినిమాని కొరటాల శివతో చేస్తున్నారు. ఆచార్య టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని దసరాకి రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

 

సినిమా తర్వాత సుజిత్ తో లూసిఫర్ రీమేక్ మూవీ లైన్ లో పెట్టేశారు చిరంజీవి. దాంతో పాటు త్రివిక్రమ్ మూవీ కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఈ డైరెక్టర్లతో పాటు బాబీ, హరీష్ శంకర్, సుకుమార్ తో సినిమాలు చెయ్యడానికి ఇంట్రస్ట్ చూపిస్తూ కథలు వింటున్నారు చిరంజీవి. ఎందుకంటే.. యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేసి తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నారు  ఈ సిక్స్ టీ ప్లస్ హీరో. ఇలాగే సినిమాలు చేస్తే.. ఇక యంగ్ హీరోలు సామాను సర్దుకోవాల్సిందే.

 

టాలీవుడ్ లో మరో సీనియర్ స్టార్ నాగార్జున కూడా స్టిల్ యంగ్ హీరో ఫిజిక్ ని, లుక్స్ ని మెయింటెన్ చేస్తున్నాడు. 60 ఏళ్ల వయసులో నాగార్జున  కూడా కొత్త కథలతో ప్రయోగాలు చేస్తూ.. యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు . మన్మధుడు 2 తో అందరినీ సర్ ప్రైజ్ చేసిన నాగార్జున ఇప్పుడు.. యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో బ్రహ్మస్త్ర సినిమా కూడా చేస్తున్నాడు. ఈసంవత్సరంలోనే మరో మూవీ బంగార్రాజు కు కూడా ముహూర్తం ఫిక్స్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు ఈ టాలీవుడ్ సిక్స్ టీ ప్లస్ మన్మధుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: