రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ గురించి వస్తున్నన్ని వార్తలు మరే సినిమా గురించి రావట్లేదేమో. ఈ లాక్డౌన్ సమయంలో మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేసిన రాజమౌళి, ఆర్.ఆర్.ఆర్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. అంతే కాదు ఇంట్లో ఉంటూనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు మీడియా ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు.

 

ఈ నేపథ్యంలో అందరి నుండి ఒకే ఒక్క ప్రశ్న వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ లుక్ రివీల్ చేస్తారా అని. అయితే దీనికి మొదట్లో ఇంట్రడక్షన్ సీన్లు ఇంకా షూట్ చేయలేదని, అందువల్ల ఎన్టీఆర్ లుక్ రివీల్ చేయడం కష్టం అని వార్తలు వచ్చాయి. దీంతో ఎన్టిఆర్ అభిమానులు కొంచెం నిరాశకి గురయ్యారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ చూసినప్పటి నుండి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలన్న కోరిక ఎక్కువైంది.

 

అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ అభిమానులకి సర్ప్రైజ్ రెడీగా ఉందని అంటున్నారు. లాక్డౌన్ కారణంగా ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఇంట్లోనే జరుతుగుందట. ఎడిటర్ తమ్మిరాజు సమక్షంలో సినిమా ఎడిట్ అవుతుందని సమాచారం. అయితే సినిమా ఎడిటింగ్ తో పాటు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో కూడా ఎడిట్ అయ్యిందని అంటున్నారు. అంటే మే ౨౦వ తేదీన కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడబోతున్నాం అన్నమాట.

 

మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు మే ౨౦వ తేదీన నిజం అవుతాయా లేదా చూడాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం.. ఎన్టీఆర్ పుట్టినరోజున కొమరం భీమ్ లుక్ రివీల్ చేయకపోతే అభిమానులు చాలా అప్సెట్ అవుతారు. ఆ విధంగా ఆలోచించి అయినా సరే రాజమౌళి ఎన్టీఆర్ లుక్ ని రివీల్ చేస్తే బాగుంటుందేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: