టాలీవుడ్ లో ప్రభాస్ తో సినిమాలు చెయ్యాలి అనుకునే హీరోయిన్ ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ప్రభాస్ తో సినిమా చేస్తే చాలు ఇక తిరుగు ఉండదు అని భావించే హీరోయిన్ లు సినిమా చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఏ హీరోయిన్ అయినా సరే ఒక్కసారి ప్రభాస్ తో సినిమా చేస్తే చాలు అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన పక్కన నటించిన హీరోయిన్ లు అందరూ కూడా స్టార్ హీరోయిన్ లే అయ్యారు. అందులో అనుష్క ప్రధానంగా చెప్పుకునేది. అతని తో కలిసి ఆమె మూడు సినిమాలు చేసింది. 

 

ఆ మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇది ఇలా ఉంటే సమంతా మాత్రం ప్రభాస్ తో సినిమా చెయ్యాలని ఆఫర్ వచ్చినా సరే చేసేది లేదు అని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ప్రభాస్ తో తనకు సినిమా వద్దు అని ఆమె మొహం మీదే చెప్పింది అని అంటారు. మిర్చి సినిమాలో రీచా గంగోపాధ్యాయ స్థానంలో సమంతాను ఎంపిక చేసారని ఆమె అందుకు ఆసక్తి చూపించలేదు అని అంటున్నారు. ఆమె కు ముందే ఆఫర్ ఇచ్చినా సరే ఆమె మాత్రం సినిమా చేసేది లేదని ఎంత ఇచ్చినా సరే తాను మాత్రం చేయలేను అని స్పష్టంగా చెప్పింది అని అంటూ ఉంటారు. 

 

ఆమె ఎందుకు అతని తో సినిమా చేసేది లేదు అని చెప్పిందా అనే దానికి స్పష్టమైన కారణం తెలియదు గాని అతని పక్కన తాను నటిస్తే కామెంట్స్ బ్యాడ్ గా వస్తాయని తాను హిట్ తక్కువగా ఉన్నా అని ప్రభాస్ హైట్ ఎక్కువగా ఉంటాడని అందుకే ఆమె సినిమా చేయలేదు అని చెప్పినట్టు సమాచారం. చాలా మంది దర్శకుల కు ఇది ఇప్పటికి అర్ధం కాని విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: