పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసే డైరక్టర్స్ ఎవరుండరు చెప్పండి. పవన్ కళ్యాణ్ మాత్రం ఆల్రెడీ స్టార్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న వారితో కన్నా కొత్త వాళ్లతో చేస్తుంటాడు. పవన్ చేసిన 25 సినిమాల్లో పదిమందికి పైగా కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చాడు. పవర్ స్టార్ తో సినిమా చేయాలని స్టార్ డైరక్టర్స్ కు ఉన్నా పవన్ మాత్రం న్యూ టాలెంట్ నే ప్రోత్సహిస్తారు. అయితే ఒక్క త్రివిక్రమ్ విషయంలో మాత్రం ఈ రూల్ వర్తించదు. 

 

ఇక పవర్ స్టార్ తో దర్శధీరుడు రాజమౌళి సినిమా చేస్తే.. అబ్బో ఈ ఆలోచనే కొత్తగా ఉంది కదా.. పవర్ స్టార్ లాంటి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ తో రాజమౌళి సినిమా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. మాములుగా రాజమౌళి సినిమాలో హీరోలు చాలా పవర్ ఫుల్ గా ఉంటారు. అలాంటిది పవర్ స్టార్ తో సినిమా అంటే ఇక  తప్పుకోవాల్సిందే. రాజమౌళి పవన్ సినిమా అంటే ఇక అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. రాజమౌళి డైరెక్ట్ చేయాలనుకునే హీరోల లిస్ట్ లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. 

 

అయితే ఈ కాంబో సెట్ అవ్వాలంటే మాత్రం చాల కష్టం. ఏ హీరోతో అయినా తాను సినిమాకు రెడీనే కాకపొతే కథ అనుకున్నప్పుడు దానికి ఆ హీరో పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు కచ్చితంగా అందరితో సినిమా చేస్తా ఇంటర్వ్యూలో చెబుతాడు రాజమౌళి. సో పవర్ స్టార్ రేంజ్ కథ వస్తే మాత్రం రాజమౌళి సినిమా తీసేస్తాడని చెప్పొచ్చు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా లైన్ లో పెట్టాడు.               

మరింత సమాచారం తెలుసుకోండి: