టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ సమంతా. ఆమె సినిమాలు అన్నీ కూడా దాదాపుగా మంచి విజయాలు సాధించాయి. టాలీవుడ్ లోఅగ్ర హీరోలు అగ్ర దర్శకులు అందరూ కూడా ఆమె తో సినిమాలు చేసిన వాళ్ళే ఇక ఆమె కెరీర్ లో ఎదురైన కొన్ని అనుభవాలు ఆమెను ఒకానొక సమయంలో తెలుగు సినీ పరిశ్రమకు దూరం చేశాయని టాలీవుడ్ పెద్దలు అంటూ ఉంటారు. కెరీర్ తొలి నాళ్లలో ఆమెను బాగా వేధించారు కొందరు దర్శకులు అని అంటారు. అందులో ఒక పెద్ద సీనియర్ దర్శకుడు కూడా ఉన్నారు. 

 

ఆమెను అతను బాగా వేధించాడని ఆ తర్వాత ఇదే విషయాన్ని అక్కినేని నాగార్జున కు ఆమె చెప్పగా ఆయన ఆమెను సేవ్ చేసాడని అంటూ ఉంటారు. నాగ చైతన్య దృష్టికి తీసుకుని వెళ్ళడం తో ఆమె తెలుగులో ఇబ్బంది పడలేదని లేకపోతే ఆమె ఎప్పుడో కనుమరుగు అయిపోయి ఉండేది అని అంటున్నారు. ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి తర్వాత అని అంతకు ముందు ఆమెను చాలా అంటే చాలా వేధించారు కొందరు ప్రబుద్దులు అని అంటున్నారు. అది తట్టుకోలేక అసలు సినిమాను వదిలేసే ఆలోచన కూడా చేసింది అని అంటారు. 

 

ఇక పారితోషికం ఇవ్వకుండా కూడా తర్వాత ఆతర్వాత ఆమెను బాగా ఇబ్బందులు పెట్టారని వాటిని ఆమె భరించలేక ఒకరి ముందు కన్నీరు పెట్టుకుంది అని చెప్తూ ఉంటారు. తాను అసలు తెలుగు సినిమాలో ఉండలేను అని స్పష్టంగా చెప్పింది అని అంటారు. ఆమె ఎన్ని విధాలుగా అప్పుడు తెలుగు సినిమా నుంచి బయటకు రావాలి అని చూసినా సరే ఆమె మాత్రం బయటకు రాలేకపోయిదని ఆ తర్వాత ఆమె కు కొందరు బాగా అండగా నిలిచారు అని అందుకే నిలబడి అగ్ర హీరోయిన్ అయింది అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: