టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయితే చాలు బాలీవుడ్ లో సినిమాలు చెయ్యాలని ఎవరు అయినా సరే ఆలోచిస్తూ ఉంటారు. ఆ వరుసలో ముందు నిలబడేది మన హీరోయిన్ లే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావించి హీరోయిన్ లు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. అందులో కొంత మంది విజయం సాధించినా మరి కొందరు మాత్రం కెరీర్ లో చాలా ఇబ్బందులు పడ్డారని అందుకే చాలా  మంది హీరోయిన్ లు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చినా సరే చెయ్యాలి అని భావించలేదు అని అంటూ ఉంటారు. 


అందులో ప్రధానంగా చెప్పుకునేది సమంతా గురించి. ఆమెకు ఒకానొక సమయంలో బాలీవుడ్ లో చాలా ఆఫర్లు వచ్చాయి. అయినా సరే ఆమె మాత్రం బాలీవుడ్ లో సినిమా చేయడానికి అసలు ఆసక్తి చూపించలేదు అని అంటున్నారు. ఎంత పారితోషికం ఇచ్చినా సరే తాను బాలీవుడ్ లో సినిమా చేసేది లేదని అది ఏ హీరో అయినా సరే అని ఆమె స్పష్టంగా చెప్పింది అని అంటూ ఉంటారు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఉన్నా సరే తాను ఇక్కడే సినిమాలు చేస్తాను లేదా తమిళంలో సినిమాలు చేస్తాను..

 

 లేదా కేరళ లో చేసుకుంటాను గాని హింది కి వెళ్ళేది లేదని ఆమె చెప్పినట్టు సమాచారం. దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమె టాలీవుడ్ ని దాటి వెళ్ళడానికి బాగా భయపడింది అని చెప్తూ ఉంటారు. ఇతర భాషల్లో హీరోయిన్ లు ఎక్కువగా కష్టాలు పడుతూ ఉంటారని అందుకే ఆమె వెళ్ళలేదు అని చెప్తూ ఉంటారు. చాలా మంది దర్శకులు అక్కడి లవ్ స్టోరీ ఆధారంగా వచ్చే సినిమాల్లో ఆఫర్లు ఇచ్చినా సరే ఆమె మాత్రం చేయడానికి ఆసక్తి చూపించలేదు అని అంటారు. మన తెలుగులో స్టార్ హీరోయిన్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: