సమంత రూత్ ప్రభ సమంత అక్కినేని గా మారిన తర్వాత తన జీవితంలో ఎంతో ప్రేమ ఆప్యాయతలు దొరుకుతున్నాయని ఆమె అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. నిజానికి నాగచైతన్య సమంతా కు చాలా గౌరవం ఇచ్చి ప్రేమిస్తుంటాడు. అన్యోన్య దంపతులు కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా సామ్ చైతు జంటని చూపించవచ్చు. అయితే ఈ రోజు అనగా ఏప్రిల్ 28వ తేదీన సమంత అక్కినేని తన 33 వ పుట్టినరోజు ని జరుపుకుంటుంది. తన ప్రియమైన భార్య పుట్టినరోజు సందర్భంగా నాగచైతన్య ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆమెను సంతోషపరుస్తున్నాడు.


ఇందులోని భాగంగానే చైతూ తన లవ్లీ వైఫ్ కోసం మొదటిసారిగా కేక్ తయారు చేసి ఆమెను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. కేకు తయారీ విధానం తెలుసుకోవడానికి నాగ చైతన్య ఇంటర్నెట్ లో వీడియోలు చూసి... చాకొలేట్ కేక్ తయారు చేసి తన భార్యకు సమర్పించాడు. చైతూ కేక్ తయారు చేస్తున్న సమయంలో సమంత వీడియో తీసి అవి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసింది. కేక్ మొత్తం తయారైన తర్వాత కూడా ఒక ఫోటో ని తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం లక్షల మంది అభిమానులు సమంతా కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


ఇకపోతే సమంత అక్కినేని అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించనున్నది. సామ్ కు వెబ్ సిరీస్ లో నటించడం ఇదే మొదటిసారి కాగా... హిందీ ప్రేక్షకులకు కూడా మొదటిసారిగా పరిచయం కాబోతుంది. అశ్విన్ సరోవరన్ దర్శకత్వంలో ప్రశాంతి సరసన సామ్ నటిస్తున్న చిత్రం యొక్క షూటింగ్ లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఏదేమైనా తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో అలరిస్తున్న సమంతాకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మేము తెలుపుతున్నాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: