‘ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా’.. అనేది బాహుబలి2 లో డైలాగ్. దీనిని బాహుబలి2కు ప్రత్యేకంగా మారిస్తే ‘సినిమా ఉన్నంతవరకూ బాహుబలి2 ఓ చరిత్రేరా’ అని చెప్పుకోవాలేమో. ప్రపంచ సినీ పటంపై బాహుబలి2.. మొత్తంగా బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు చేసిన మాయాజాలం అంతటిది. భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అన్న ప్రపంచ సినీ అపోహలను, అంతా మేమే అనుకుంటూ కలల్లో విహరించే బాలీవుడ్ ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన సినిమా బాహుబలి2. ఈ సినిమా విడుదలై నేటితో 3ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అద్భుతం 2017 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలతో విడుదలైంది. . బాహుబలితోనే యావద్భారతం మొత్తం ఈ సినిమా వైపు చూసి నోరెళ్లబెట్టింది. క్లైమాక్స్ లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అనే పాయింట్ దగ్గర ఆపేయడంతో బాహుబలి2 మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. భారీ అంచనాలతో విడుదలయ్యే ఏ సినిమాకైనా హిట్ టాక్ వస్తే ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో బాహుబలి2కు అదే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డుల హోరెత్తించింది. మొదటి భాగంలో చూపించిన వాటర్ ఫాల్స్ లా బాహుబలి2 అంతెత్తున నిలిచింది. దీంతో ఇండియన్ సినిమా అంటే ‘బాహుబలి’ సినిమా అయిపోయింది.

IHG

 

నటులుగా ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్.. వారి పాత్రలకు ప్రాణం పోశారు. టెక్నికల్ గా కధా రచయిత, సంగీతం, ఫొటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్, కాస్ట్యూమ్స్ నుంచి అండర్ గ్రౌండ్ డిపార్ట్ మెంట్ వరకూ చేసిన కృషి ఎనలేనిది. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ రాజమౌళి తన ఊహలకు అనుగుణంగా తెరకెక్కించడం ఓ తపస్సులా చేశాడని చెప్పాలి. ఇందుకు నిర్మాతల సహకారమే బాహుబలి2 వంటి మహాద్భుతం ఆవిష్కృతం కావడానికి కారణమని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: